జీహెచ్ఎంసీ ఎన్నికలు వాడివేడిగా జరుగుతున్న సమయంలో కేసీఆర్‌పై ప్రజాగాయకుడు గద్దర్ ప్రశంసల వర్షం కురిపించడం వెనుకాల కారణాలు ఏమై ఉంటాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ పాలనపై ఫామ్ హౌజ్‌లో కూర్చొని పాలన సాగించడం తను ఎక్కడా చూడలేదని విమర్శించారు. దొరల తెలంగాణ కాదని.. దళితుల తెలంగాణ కావాలని నాడు కేసీఆర్‌కు వ్యతిరేకంగా గళమెత్తిన గద్దర్.. నేడెందుకు కేసీఆర్‌పై స్వరం మార్చుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేసీఆర్ తో కలిసి…
గ్రేటర్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కొప్పుల ఈశ్వర్ వెంకటాపురం డివిజన్‌లో ఈమధ్య పర్యటించారు. అలాగే అదే డివిజన్‌లో నివాసం ఉంటున్న గద్దర్‌ను మంత్రి కలిశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చేనట్టిన దీక్ష గురించి ఆయన గుర్తుచేసుకున్నారు. ఫెడరల్ ఫ్రెంట్‌ను సీఎం కేసీఆర్ పెట్టినట్లయితే దానికనుబంధంగా కల్చరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఆయనతో కలిసి పనిచేస్తానని చెప్పారట. అంతేకాకుండా సీఎం కేసీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారట. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణను సస్యశామలంగా చేయడంలో సీఎం కృషి చేస్తున్నారని గద్దర్ కొనియాడారు. దీంతో రైతులు సంతోషంగా ఉన్నారని కితాబిచ్చారట.
Must Read ;- కేసీఆర్ స్కెచ్ ప్రకారమే.. జనసేన బరిలో ఉంటోందా?
కేసీఆర్‌తో ఫోన్‌లో సంభాషణ…
మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో చర్చిస్తున్న సమయంలోనే సీఎం కేసీఆర్‌తో గద్దర్ దాదాపు 30 నిమిషాలపాటు మాట్లాడినట్లు సమాచారం. ఒకప్పుడు కేసీర్‌ను విమర్శించిన గద్దర్ ఇప్పుడు ఇలా ఎందుకు పొగుడుతూ మాట్లాడి ఉంటారనే దానిపై పలువురు తమ అభిప్రాయాలను ఇలా వ్యక్తం చేస్తున్నారు. ప్రజాకవి గోరటి వెంకన్నకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేయడంతోనే గద్దర్ ఏమైనా తన స్వరాన్ని మార్చుకున్నారా? అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసమే కేసీఆర్ గురించి ఇలా మాట్లాడి ఉంటారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీని కలిసి తన కుమారుడికి టిక్కెట్ కోసం మాట్లాడారు. అయితే ఈ విషయంపై గద్దర్ అప్పట్లో స్పందిస్తూ టిక్కెట్ కోసం కాదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకుగానూ కలిసినట్లు చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తన జీవితాన్ని అంతా ప్రజా పోరాటాలకే అంకితం చేసిన గద్దర్ ఇలా ప్రభుత్వ విధానాలపై జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో అనుకూలంగా మాట్లాడటం పలు చర్చలకు దారితీస్తోంది.
Also Read ;- గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి బాలయ్య, లోకేష్!











