తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా కెరియర్ ను ప్రారంభించిన తాప్సీ తగినంత గుర్తింపు మాత్రం దక్కలేదు. మంచు ఫ్యామిలితో టాలీవుడ్ లో అఢుగుపెట్టిన ఆమెకు నిరాశే ఎదురైంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ కు మారింది. బాలీవుడ్ లోకూడా తన కు గుర్తింపు నిచ్చేన్ని పాత్రలు కూడా చాలా తక్కువ. ఒక వైపు హీరోయిన్ గా మరొవైపు నిర్మాతగా బాద్యతలు చేపట్టారు. తాజాగా తన కెరియర్ పై దృష్టి పెట్టిన ఈ అమ్మడు కథ లై ప్రత్యేక శ్రద్ద పెట్టింది.
ప్రారంభం లో ఎటువంటి చిత్రం, నిర్మాత ఎవరు, కథ బలమైందా లేదా అని ఆలోచన లేకుండా ఆయా చిత్రాల్లో నటించేందుకు సిద్దమైన ఈ అమ్మడు ఇప్పుడు తన ఆలోచనను మార్పుకుంది. తన కెరియర్ కు బిల్డ్ చేసేందుకు సిద్దమైంది.తన కెరియర్ లో ఎదురుకొన్ని పరాజయాలే తన లో మార్పుకు కారణమన్నారు ఈ ఢిల్లీ భామ.
నిర్మాత గా మారిన ఈ భామ నామ్ షబానా’, ‘ముల్క్’ ‘హసీనా దిల్‌రుబా’, ‘బద్లా’, ‘లూప్ లపేట’ వంటి భిన్న మైన కథలతో పేరు సంపాదించారు. ఇప్పుడామె నిర్మాతగానూ సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. ‘ఔట్‌సైడర్స్ ఫిల్మ్స్’(outsiders films) అనే ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించి, ‘బ్లర్’(Blur) చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి పని చేసేందుకు తాను సిద్దంగా ఉన్నామని తెలిపారు.
ఇధి ఇలా ఉండగా తాప్సీ తన కెరియర్ లో పెద్ద ప్రాజెక్ట్ లో భాగస్వామ్యమయ్యారు. వయోకామ్ 18 స్టూడియోస్, బీఎల్‌ఎమ్ పిక్చర్స్‌తో కలిసి ‘ధక్ ధక్’ చిత్రాన్ని నిర్మిస్తునట్లు తాప్సీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.అందుకు సంబందించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి తరుణ్ దుదేతా దర్శకత్వం వహిస్తున్నారని తెలిపారు.స్వేచ్చ పొందిన నలుగురు మహిళలకు సంబంధించిన చిత్రమని స్పష్టం చేశారు. ఫాతిమా సనా షేక్, రత్న పాఠక్, దియా మీర్జా, సంజనా సంఘీ కీలక పాత్రధారులు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న తాప్సీకి అల్ ది బెస్ట్…