ఉపాధే జీవన మంత్రంగా నమ్మిన పార్టీ టీడీపీ..!
ఉపాధే జీవన మంత్రంగా నమ్మిన పార్టీ టీడీపీ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో గత మూడు రోజులుగా టీడీపీ లోకేష్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. కరోనాతో మృతి చెందని స్థానిక కుటుంబాలను కలిసి పరామర్శిస్తు ముందుకు సాగుతున్నారు. లోకల్ గా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. కుటుంబ పెద్దలను కోల్పోయిన పార్టీ కార్యకర్తల నివాసాలకు వెళ్లి వారిని మంచి చెడులు కనుక్కొని అండగా ఉంటామని భరోసా కల్పిస్తున్నారు. కుటుంబాలకు మనోధైర్యం చెప్పుతున్నారు. పర్యటనలో భాగంగా ఆర్థిక ఉపాధిని మెరుగు పరచడానికి పదిమందికి చిన్నతరహా వ్యాపారులకు తోపుడు బండ్లను అందజేశారు లోకేష్. ఉపాధితోనే అభివృద్ధి సాధ్యపడుతోందని, అందరికీ ఉపాధి, అభివృద్ధే టీడీపీ మంత్రమని లోకేష్ పునుర్ఘాటించారు.











