అప్పడు అవినీతి .. ఇప్పుడు నీతంటే ఎలా?
రాజధాని నగరాభివృద్ధి పేరిట ప్రపంచ బ్యాంకు రుణ ప్రతిపాదనను పెట్టింది జగన్ ప్రభుత్వం. రాజధాని ఎక్కడో ప్రజలకు, బ్యాంకులకు క్లారిటీ ఇవ్వకుండా అప్పులు ఇవ్వండి బాబాయ్ అంటే చెవిలో పూలు పెట్టుకుని ఎవరు లేరిక్కడ అన్నట్లు బ్యాంకులు గట్టిగానే రియాక్షనే ఇస్తున్నాయి. తాజాగా రూ.50 వేల కోట్లు కావాలని ప్రపంచ బ్యాకు దరఖాస్తు చేసుకుంది ప్రభుత్వం. అయితే గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతి అభివృద్ధి కోసం అప్పు కావాలని ప్రపంచ బ్యాంకు ను ఆశ్రయించింది. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అంతా అబద్ధం.. అమరావతి పేరుతో అవినీతి జరుగుతోందని ప్రపంచ బ్యాంకు కు ఫిర్యాదు చేసింది. విచారించిన తరువాత అంతా సక్రమంగానే ఉన్నాయని రుణం ఇవ్వడానికి సంతృప్తిని వ్యక్తం చేసింది. కొన్ని కారణాల వలన ఆ రుణాన్ని టీడీపీ ప్రభుత్వం వద్దునుకుంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ రాజధాని అభివృద్ధి పేరుతో గత ప్రభుత్వం వద్దనుకున్న రుణాన్ని కావాలని ప్రపోజల్స్ పెడుతోంది. అప్పుడు అదంతా అవినీతి .. అక్రమం అన్న పార్టీ .. అధికారంలోకి వచ్చిన తరువాత స్వరం మార్చి .. అంతా నీతి .. సక్రమం అని కూతలు కూస్తే ఎలా? అని తెలుగు దేశం పార్టీ విమర్శిస్తోంది.
రుణం మంజురైతే.. నిధుల ఎక్కడ ఖర్చు చేస్తారు?
నాడు – నేడు జగన్ ప్రభుత్వం మడమ తిప్పిన ఒకేఒక్క మాట…. రాజధాని ప్రాంతంలో మౌళిక వసతులకు రూ. లక్షకోట్లు అవుతాయని. మరి లక్షకోట్లు వెచ్చించి నిర్మించలేని పరిస్థితుల్లో మూడు రాజధానులకు మొగ్గు చూపి .. మరి మేలైనా.. సమగ్ర బిల్లుతో మరోసారి ‘మూడు’తో వస్తానడంలో అంతర్యమేమిటో రాష్ట్ర ప్రజలకు అర్థకావడం లేదు. మరి ప్రపంచ బ్యాంకు నుంచి క్యాపిటర్ డెవల్‌పమెంట్ పేరుతో తీసుకోబోతున్న రుణం ఎందుకు అంటే .. ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. ప్రపంచ బ్యాంకు రుణం మంజురు చేస్తే .. ఆ మొత్తాన్ని రాజధాని అభివృద్ధికే కేటాయిస్తారా? లేదా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఏపి రాజధాని ఏది అన్నది రాష్ట్ర ప్రజలకు కూడా అయోమయ పరిస్థితి కాబట్టి. ఇప్పటికే ప్రభుత్వ రంగ శాఖల్లోని నిధులను కొల్లగొట్టి దారిమళ్లించారు. రాష్ట్రం అప్పుల్లో పూర్తిగా కురుకుపోయింది .. దివాలా వైపు పయణిస్తోందని అనేక మాధ్యమాలు కోడైకూస్తున్నాయి. పరిశ్రమ స్థాపనలేవు .. స్థాపించేందుకు ముందుకు వస్తున్న సంస్థలకు ప్రోత్సహకాలు లేవు ….. భూములు … మనుగడకు మౌళిక వసతులు లేవు…అని పరిశ్రమలు మోహం చాటెస్తున్నాయి. మరి యువతకు ఉపాధి, ఆదాయ వనరుల పెంపు అన్నది ఏపిలో ప్రశ్నార్థకమేగా అన్నది దాచాలనుకున్న దాగని పచ్చినిజం. ఆదావనరులను పెంపొందించే అంశాలపై దృష్టిసారించపోవడం నాణేనికి ఒకవైపైతే .. ఆర్థిక క్రమశిక్షణ, ఆడిట్ లో లెక్క తెలనన్ని గజిబిజి పద్దుల సమాహారంలో మరోవైపు అన్నట్లు ఉంది పాలన. లెక్కకు చూపకుండా లక్షల కోట్లను దారిమళ్లిచారని ఎప్పటినుంచో విపక్షలు, ప్రజలు జగన్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. కానీ అవేమి పట్టని ప్రభుత్వం ఇంకా ఒంటెద్దుపొకడలను అనుసరించడం విచారకరం!











