వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి, జగన్ వదిలిన బాణం.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డితోపాటు, సొంత అన్నయ్య జగన్‌కీ షర్మిల పంచ్ ఇచ్చారు.. తెలంగాణ ఎన్నికలలో వైఎస్‌ఆర్‌టీపీ పోటీ నుండి విరమించుకోవడంపై సజ్జల రియాక్ట్ అయ్యారు.. ఇది ఆమె సొంత వ్యవహారమని, షర్మిల పార్టీ గురించి జగన్ కనీసం ఆలోచించరని కామెంట్ చేశారు.. సజ్జల రియాక్షన్‌పై షర్మిల కౌంటర్ ఇచ్చారు..
వైఎస్‌ఆర్‌టీపీతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని తాను ప్రారంభించిన సమయంలో వ్యాఖ్యానించిన సజ్జల, ఇప్పుడు ఏం సంబంధం ఉందని తమ గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.. ప్రస్తుతం తెలంగాణ ప్రజలతో తమకు సంబంధం ఉందని వైసీపీ నేతలు అంగీకరిస్తున్నారా అని నిలదీశారు షర్మిల.. ఏపీ ఆర్ధిక పరిస్థితిపై అక్కడి నేతలు ఆలోచిస్తే మంచిదని, తెలంగాణ గురించి ఎందుకని ఆమె కౌంటర్ ఇచ్చారు.. జగన్‌కి ఏం సమాధానం ఇస్తారని ప్రశ్నించిన విలేకరకి సజ్జలకి ఇచ్చిన సమాధానమే తాను అందరికీ ఇస్తున్నానని, జగన్‌కి సైతం తన సమాధానం ఇదే అని అన్నారు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీలో జగన్ సర్కార్ అస్తవ్యస్త పాలనపై కామెంట్ చేస్తే, ఆయనకు సమాధానం చెప్పే దమ్ములేదని చురకలు అంటించారు వైఎస్ షర్మిల. ఏపీ చీకట్లలో ఉందని, అక్కడి రోడ్ల గురించి కేసీఆర్ వ్యాఖ్యానిస్తే.. వైసీపీ నేతలు సైలెంట్‌గా ఉన్నారని వివరించారు.. కొన్ని కారణాల వలన కాంగ్రెస్‌లో తమ పార్టీని విలీనం చేస్తామని భావించామని, కానీ, కొందరి స్వార్ధంతో అది కుదరలేదని తెలిపారు షర్మిల..
మొత్తమ్మీద, అన్న జగన్‌తోపాటు ఆయన టీమ్‌తోనూ షర్మిలకు అభిప్రాయ బేధాలున్నాయని మరోసారి స్పష్టంగా అర్ధం అవుతోంది.. అయితే, ఆమెను ఏపీ ఎన్నికల బరిలోకి దింపాలని భావిస్తోన్న కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలను తెలంగాణ ఎన్నికల తర్వాత అనుసరిస్తారా.? లేదా.. అనేది చూడాలి..