కోవిడ్ బాధిత కుటుంబాలను పట్టించుకొండి..
కోవిడ్ మొదటి, రెండో వేవ్స్ లో ఏపీ, బీహార్ రాష్ట్రాలలో వైరస్ భారీన పడి మృతి చెందిన వారి సంఖ్యల అధికంగా ఉంది. అలా కోవిడ్ భారిన పడి మృత్యువాత పడిన కుటుంబాలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు చేతులెత్తిసి విస్మరించింది. దీనిపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బుధవారం 2 గంటలకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హాజరుకావాలని ఆదేశించింది. అలాగే బీహార్ ప్రభుత్వం తీరుపై కూడా ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కోవిడ్ వైరస్ సోకి, కుటుంబ యజమాని మరణిస్తే.. కుటుంబానికి నష్టపరిహారం అందించాల్సిన కనీస ఇంగితం లేకుండా ఇరు ప్రభుత్వాలు వ్యవహరించాయని అభియోగం!
సుప్రీం ఆదేశాలను ఎందుకు పాటించడంలేదు..
కరోనా కారణంగా మరణించిన బాధిత కుటుంబానికి రూ. 50 వేలు చొప్పున నష్టపరిహారం అందించాలని గతంలో సుప్రీం ఆదేశించింది. అలానే కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే ఈ చెల్లింపు విషయంలో ఏపీ, బీహార్ తో పాటు మరికొన్ని రాష్ట్రాలు నిర్లక్ష్యం వహించాయి. దీనిపై దాఖలైన పిటిషన్ పై బుధవారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఏపీ, బీహార్ రాష్ట్రాల చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు మందు హాజరుకావాలని, పరిహారం ఎందుకు ఇవ్వలేదో వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.











