వినాయక చవితి అంటే పందిళ్ళు , భారీ విగ్రహాలు , చందాలు , మైకులు , వంద పాటలు , సౌండ్స్ గుర్తుకొస్తాయి . ఇక నిమజ్జనం రోజైతే ఊరేగింపులు , లడ్డూల వేలం పాటలు తప్పని సరి . ఈ ఏడాది కరోనా దెబ్బ కి ఇలా చేసే అవకాశం లేదు . ఇది చాలా మందిలో నిరుత్సాహాన్ని కలిగించింది. కరోనా వల్ల చిర కాల సంప్రదాయానికి ఆటంకం ఏర్పడిందని బాధ పడుతున్న వాళ్ళు లేక పోలేదు . అయితే ఈ పందిట్లో విగ్రహాలు, నిమజ్జనాలు .. ఆచారం మొదలై కేవలం187 సంవత్సరాలు మాత్రమే అయింది .
అప్పట్లో భారతీయులు 20 మంది మించి బయట గుమి కుడటానికి వీలుండేది కాదు . అలాంటి పరిస్థితులలో మహారాష్ట్ర కి చెందిన లోకమాన్య బాల గంగాధర్ తిలక్ 1833 లో సామూహికం గా వినాయక చవితి ఉత్సవాలు జరపడం మొదలు పెట్టారు. ఈ రకంగా ప్రజల్లో జాతీయతా భావం పెంచ వచ్చనేది తిలక్ భావన . ఈ అలవాటు దేశ వ్యాప్తంగా విస్తరించింది . ఆలా ఇది ఒక ఆచారంగా అలవాటైంది. అంతే తప్ప పురాణాల్లో చెప్పిన విధానం కాదు . అందువల్ల కరోనా వచ్చి మన ఆచారం మంట గలిపిందని బాధ పడకుండా ఆనందంగా , సంప్రదాయం గా ఇంటిలోనే వినాయక చవితి పండగ చేసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.