కరీంనగర్ టీఆర్ఎస్ నేతలకు మరోసారి ఈటల వర్గీయులు షాక్ ఇచ్చారు. ఇప్పటికే కొందరు నాయకులు ఈటల వెంట ఉంటామని బహిరంగంగా చెప్పడం టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చినట్లయింది. అయితే తాజాగా వీణవంకలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ హాజరయ్యారు. ఆయన టీఆర్ఎస్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ ఈటల వెంట ఎవరూ వెళ్లకూడదని, టీఆర్ఎస్ లోనే ఉండాలని మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా జై ఈటల.. జైజై ఈటల నినాదాలు చేశారు కొందరు కార్యకర్తలు. దీంతో టీఆర్ఎస్ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. దీంతో ఈటల కార్యకర్తలను వారించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి సముదాయించారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహరం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఆయనపై రోజురోజుకూ అంచనాలకు పెరుగుతున్నాయి. కొత్త పార్టీ పెడతారా.. లేక బీజేపీలో చేరుతారనే అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవైపు ఈటల రాజకీయ భవిష్యత్తు కార్యాచరణాపై బిజీగా ఉంటుంటే, అధికార పార్టీ మాత్రం ఆయనను ఒంటిరిగా చేసేందుకు పావులు కదుపుతోంది. ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. హుజూరాబాద్, చుట్టుపక్కల మండలాల నేతలను ప్రలోభపెట్టే పనిలో ఉంది. కొందరు ఈటలతో ఉంటామని స్పష్టం చేయగా, మరికొందరు అధికార పార్టీలో కొనసాగుతామని చెప్తున్నారు.











