పుత్రోత్సాహం అనేది ఏ తండ్రికైనా ఆ పుత్రుడు జన్మించినప్పుడే ఉండదు.. జనం ఆ పుత్రుడు సాధించిన విజయం చూసి పొగిడినప్పుడే ఉంటుంది. గోవర్ధనరావు దేవరకొండ, మాధవి దేవరకొండ దంపతులు ఇప్పుడు అలాంటి పుత్రోత్సాం లోనే ఉన్నారు. ఇంతకీ వీరెవరా? అనుకుంటున్నారా.. మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు. గోవర్దనరావును అందరూ వర్దన్ అంటూ ఉంటారు.
నిజానికి ఆయన సినిమా రంగంలో ఏదో సాధించాలన్న తపనతో అడుగుపెట్టారు. చివరికి దాన్ని ఆయన పుత్రులు సాధిస్తున్నారు. ఏ తండ్రికైనా అంతకంటే కావలసింది ఏముంటుంది. ఒక పుత్రులే కాదు ఇద్దరు పుత్రులు హీరోలుగా ఎదిగిపోతుంటే ఏ తండ్రికైనా అంతకంటే కావలసింది ఏముంటుంది. చిన్నకుమారుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ సినిమా రాత్రి అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది.
ఈ సినిమాని విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు తమ ఇద్దరు కుమారులతో కూర్చుని మరీ సినిమా చూశారు. వీరితో పాటు ఈ చిత్ర కథానాయిక వర్ష బొల్లమ్మ కూడా ఉందండోయ్. మరో ప్రత్యేక అతిథి కూడా ఇందులో పాలుపంచుకుంది. వారి పెంపుడు శునక రాజం కూడా ఈ సినిమా చూసి తెగ ఎంజాయ్ చేసేసింది. ఈ సినిమా చూస్తున్న ఫోటోను విజయ్ దేవరకొండ ట్వట్టర్ లో షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు.
I told you it comes with full approval ❤️
Good opportunity to do something together with your entire family – get together, huddle, watch and enjoy 😊 #MiddleClassMelodieshttps://t.co/T9NaSVxizJ pic.twitter.com/9GoMAtZryh
— Vijay Deverakonda (@TheDeverakonda) November 20, 2020
Must Read ;- కన్నడ స్టార్ హీరోపై కన్నేసిన‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు











