‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డైరెక్టర్ అయిపోయాడు సందీప్ రెడ్డి వంగా. ఆ సక్సెస్ క్రెడిట్ తో ఈ దర్శకుడు అదే సినిమా బాలీవుడ్ వెర్షన్ కూ డైరెక్టర్ అయ్యాడు. ఆ సినిమా కూడా సూపర్ హిట్టయింది. దీంతో సందీప్ తో సినిమాలు తీయడానికి బాలీవుడ్ దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి ముందుకొస్తున్నారు. ప్రస్తుతం హిందీలో ఓ స్టార్ డైరెక్టర్ తో ఒక మూవీని తెరకెక్కిస్తోన్న ఈ దర్శకుడు తెలుగులో మహేశ్ బాబు, ప్రభాస్ లాంటి హీరోలతో సినిమాలు చేయాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. అయితే ఆ ఇద్దరూ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో.. అతడి దృష్టిలో ఇప్పుడు మరో హీరో పడ్డాడు.
‘కేజీఎఫ్’ తో సంచలన విజయాన్ని అందుకున్న కన్నడ హీరో యశ్ తో సందీప్ రెడ్డి ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నడని ఫిల్మ్ నగర్ టాక్. యశ్ కోసం సందీప్ ఓ పీరియాడికల్ స్టోరీ రాస్తున్నాడట. త్వరలోనే యశ్ కి స్టోరీ లైన్ వినిపించనున్నాడని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే పూర్తి స్ర్కిప్ట్ రెడీ చేస్తాడట. యశ్ ప్రస్తుతం ‘కేజీఎఫ్ 2’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కంప్లీట్ లోగానే సందీప్ యశ్ కి కథ వినిపిస్తాడని తెలుస్తోంది. మరి యశ్ తో సందీప్ ఏ తరహా చిత్రం తెరకెక్కిస్తాడో చూడాలి.











