కుటుంబ పెద్ద ఆ ఇంటి నిర్వాహణ చూటుకుంటాడు… గ్రామ పెద్ద ఆ ఊరు బాబోగులు చూసుకుంటాడు… అదే మాదిరిగా పార్టీ పెద్దగా తన కార్యకర్తలు, తన వద్ద పనిచేసే ఉద్యోగుల బాగోగులు చూసుకోవాలన్నది ఆయన సిద్ధాంతం… ఎంత బిజీగా ఉన్నప్పటికీ వారి పిలుపును ఆయన మరువరు… అందుకే ఆయనని వదులుకోరు కార్యకర్తలు..ఇంతకీ ఎవరా నాయకుడు ? ఆయన చూపిన ఔదార్యం ఏమిటి అనుకుంటున్నారా ? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే..
ఆయనొక లెజెండరీ పర్సన్.. క్షణం తీరిక లేని మనిషి.. వేలకు తిండి విషయం కూడా పట్టించుకోలేనంత సమయాభావం ఆయనది. నిరంతరం నాయకులు, కార్యకర్తలతో సమయం చాలక సత్యమమయ్యే నాయకుడు. ఆయనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. అధికారంలో వున్నా లేకున్నా సభలు, సమీక్షలు, పరామర్శలు, సహాయాలతో బిజీగా ఉండే చంద్రబాబు ఓ పెళ్లి పెద్దలా, కుటుంబపెద్దగా తెరవెనుక ఉండి అన్నీ తానై ప్రచారానికి దూరంగా చేయించిన ఓ వివాహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
దేశంలోనే ఏ రాజకీయ పార్టీని చేయని విధంగా తెలుగుదేశం పార్టీ తరఫున తమ కార్యకర్తలు, ఉద్యోగుల సంక్షేమానికి ఒక విభాగం ద్వారా సేవలు అందించేలా కార్యాచరణను రూపొందించారు చంద్రబాబు.ఈ సంక్షేమ విభాగం ద్వారా టిడిపి కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల వివాహం జరిగితే 50 వేల కానుకగా అందించాలని నిర్ణయించి అమలు చేస్తున్నారు.ఇది ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. క్షణం తీరికలేని బిజీ షెడ్యూల్‌లో కూడా చంద్రబాబు తన కార్యకర్తలు, తన వద్ద పనిచేసే ఉద్యోగుల బాగోగులూ స్వయంగా పర్యవేక్షిస్తుంటారు.అందుకేనేమో చంద్రబాబు దగ్గర ఏ హోదాలో ఉద్యోగంలో చేరినా, పని ఒత్తిడి ఎంత వున్నా, కుటుంబసభ్యుడిలా ఆయన చూపించే ఆదరణతో ఎవ్వరూ బాబు వద్ద ఉద్యోగం వదులుకోరు.ఈ క్రమంలోనే ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా జరిగిన శ్రీనివాసకళ్యాణం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
పల్నాడు ప్రాంతానికి చెందిన మేకల శ్రీనివాసరావు నాలుగేళ్ల క్రితం నూనూగు మీసాలు కూడా రాని వయస్సులోనే చంద్రబాబు వ్యక్తిగత సహాయకుల బృందంలో ఒకడిగా చేరాడు.ఆయన తమపై చూపించే అభిమానంతో గౌరవం మరింత పెంచుకున్న శ్రీను ఈ నెల 25వ తేదీన జరగబోయే తన వివాహానికి బాబు గారు రావాలని ఆశపడ్డాడు.ఈ విషయం ఆయనకు ఎలా చెప్పాలో అని సత్యమతమవుతూనే.. ధైర్యం చేసి విషయాన్ని బాబు గారికి చెప్పేశాడట. దీంతో పెళ్లికి వస్తానని మాటివ్వడమే కాదు..ఆ పెళ్లికి సంబంధించిన వేదిక మొదలు వేడుక, విందుకు సంబందించిన ఏర్పాట్లన్నీ చంద్రబాబే చేశారట.
పెళ్లి పెద్దగా, కుటుంబ పెద్దగా తెరవెనుక ఉండి అన్నీ తానై ఏర్పాట్లు చేయించడమే కాదు.. ఇచ్చిన మాట ప్రకారం విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలో ఓ హోటల్‌లో జరిగిన వివాహా వేడుకకు చంద్రబాబు స్వయంగా హాజరై వధూవరులను ఆశీర్వదించారట. వచ్చి అక్షతలు వేస్తే చాలనుకున్న దైవమే పెళ్లి పెద్ద అయ్యి తన వివాహం జరిపించడంతో శ్రీను ఆనందానికి హద్దులు లేకుండా పోయిందట.
మరోవైపు వివాహానికి చంద్రబాబు వస్తున్నారనే సమాచారం అందడంతో అలర్ట్ అయిన పోలీసులు, సెక్యూరిటీ పరంగా చేయాల్సిన ఏర్పాట్లన్నీ హడావుడిగా చేసేశారట.ఇక బాబు వస్తున్నారని తెలియడంతో స్థానిక నాయకులు కొంతమంది వివాహానికి హాజరయ్యారట.అయితే శ్రీను పెళ్లి వేడుక పై వారి మధ్య హాట్ హాట్ గా చర్చ నడిచిందట.ఎవరీ కుర్రాడు? చంద్రబాబు, స్వయంగా ఇతని పెళ్లికి రావాల్సినంత ప్రత్యేకత ఏంటి అని వారంతా చర్చించుకున్నారట.
కాగా, చంద్రుని చల్లని దీవెనలు అందుకున్న శ్రీనివాస్ చంద్రికలు ఎంత అదృష్టవంతులో కదా! కుటుంబపెద్దలా వచ్చి చంద్రబాబు జరిపించిన శ్రీనివాసకళ్యాణం కమనీయమే అని పెళ్ళికి హాజరైన వారంతా కూడా మాట్లాడుకున్నారట.