పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్ తో భారీ పిరియాడిక్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ రీ ఎంట్రీలో వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ.. వీటిలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం క్రిష్ మూవీనే అని చెప్పచ్చు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను పవన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. రాజసం ఉట్టిపడుతోన్న పవర్ స్టార్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా.. పిరియాడిక్ మూవీ కావడం.. ఇది పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ భారీ చిత్రాన్ని సీనీయర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ షూటింగ్ జరిగింది. ఇక ఈ మూవీకి ‘విరూపాక్ష’ అనే టైటిల్ అంటూ వార్తలు వచ్చాయి. నిజంగానే ఈ సినిమాకి ‘విరూపాక్ష’ టైటిల్ పెట్టనున్నారా.? క్రిష్ ఈ టైటిల్ రిజిష్టర్ చేయించారా..? లేదా..? అని ఆరా తీస్తే.. క్రిష్ ఈ టైటిల్ ని రిజిష్టర్ చేయించలేదని తెలిసింది.
ఈ టైటిల్ ని నెల్లూరుకు చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ రిజిష్టర్ చేయించారని సమాచారం. ఓ కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు ఈ టైటిల్ రిజిష్టర్ చేయించారట. దీంతో క్రిష్ ‘విరూపాక్ష’ అనే టైటిల్ నే పెడతారా..? వేరే టైటిల్ పెడతారా.? ఒకవేళ ఈ టైటిలే పెట్టాలనుకుంటే.. ఈ టైటిల్ ని రిజిష్టర్ చేయించిన వాళ్ల దగ్గర నుంచి తీసుకుంటారా.? అనేది ఆసక్తిగా మారింది.
Must Read ;- పవన్ కళ్యాణ్ పాత్ర ‘గని’ పేరుతో వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్











