పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్ తో సినిమా చేస్తున్నారు. భారీ పిరియాడిక్ మూవీగా రూపొందుతోన్నీ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. వీటితో పాటు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిలతో కూడా సినిమాలు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే.. ఈ సినిమాల మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలా అయ్యప్పనున్ కోషియమ్ రీమేక్ వచ్చింది. దీనికి టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే.. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు మరో హీరో క్యారెక్టర్ ఉంది. ఈ క్యారెక్టర్ లో దగ్గుబాటి రానా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి కానీ.. అఫిషియల్ గా ప్రకటించలేదు. ఇదే విషయం గురించి రానాని అడిగితే.. ఈ సినిమా కోసం అడిగిన మాట వాస్తవమే కానీ.. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు అని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఓ వార్త ప్రచారంలో ఉంది. అది ఏంటంటే.. పవన్ కళ్యాణ్ సినిమా అంటే.. ఆయన క్యారెక్టరే స్ట్రాంగ్ గా ఉంటుంది. పైగా ఈ చిత్రానికి పవన్ కి అత్యంత ఆప్తుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు అందిస్తున్నారు.
అలాంటప్పుడు పవన్ క్యారెక్టర్ కి కాకుండా వేరే క్యారెక్టర్ కి అంత ఇంపార్టెన్స్ ఉండదు. ఈ సినిమాలో నటించినా.. పేరు పవన్ కే వస్తుంది తప్పా ఇందులో నటించిన మరో హీరోకి రాదు. అందుకనే ఈ సినిమాలో నటించడానికి వేరే హీరోలు అంతగా ఆసక్తి చూపించడం లేదని టాక్ వినిపిస్తుంది. అయితే.. రానా నటించడం మాత్రం ఖాయం అని గట్టిగా వినిపిస్తుంది. త్వరలోనే రానా ఈ సినిమాలో నటించనున్నాడా.? లేదా.? అనేది క్లారిటీ ఇవ్వనున్నారని.. అంతే కాకుండా షూటింగ్ డీటైల్స్ ను కూడా ఎనౌన్స్ చేయనున్నారని సమాచారం.
Must Read ;- ప్రభాస్ వెర్సెస్ పవన్.. బాక్సాఫీస్ ను షేక్ చేసేది ఎవరు..?