నిన్న విజయ్ దేవరకొండ బాక్సింగ్ ఫొటో ఎలాంటి కిక్ ఇచ్చిందో తెలిసిందే. ఈరోజు మరో బాక్సింగ్ హీరో ఫొటో అలాంటి కిక్కే ఇస్తోంది. అది మరెవరిదో కాదు హీరో వరుణ్ తేజ్ ది. ఈరోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు. వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ కథాంశంతో కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫస్ట్ లుక్ తోపాటు మోషన్ పోస్టర్ ను ఈ రోజు ఉదయం విడుదల చేశారు. వి. వి. వినాయక్ తో పాటు పలువురు ప్రముఖ దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన కిరణ్ కొర్రపాటి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రముఖ బాక్సర్ మహమ్మద్ అలీ ప్రేరణతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బాలు సినిమాలో పవన్ కళ్యాణ్ పోషించిన ‘గని’ పాత్ర పేరునే ఈ సినిమాకు టైటిల్ గా నిర్ణయించారు.
హీరో వరుణ్ తేజ్ కూడా ఈ సినిమాలోని తన పాత్ర కోసం బాక్సింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ ఈ సినిమాతో పాటు ఎఫ్ 3లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ 2019 అక్టోబరులోనే ప్రారంభమైనా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. నవంబరు నుంచి శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. దీనికి ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా కామన్ డీపీని కూడా విడుదల చేశారు. హీరోగా వరుణ్ తేజ్ కు ఇది పదో సినిమా.
Must Read ;- బాబాయ్ నిర్మాతగా.. అబ్బాయి హీరోగా సినిమా