పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ కంప్లీట్ చేశారు. సమ్మర్ లో వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. రీసెంట్ గా పవన్ క్రిష్ డైరెక్షన్ లో రూపొందుతోన్న మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. భారీ పిరియాడిక్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇది పవన్ నటిస్తోన్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఈ క్రేజీ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే.. ఇందులో ఓ ముఖ్య పాత్ర కోసం అనసూయను కాంటాక్ట్ చేసినట్టు సమాచారం. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలోని ఓరి దేవుడో దేవుడో.. సాంగ్ కోసం అనసూయను అడిగితే.. వేరే సినిమాలో బిజీగా ఉండడం వలన నో చెప్పిందట.
ఇప్పుడు మరోసారి పవన్ సినిమాలో ఛాన్స్ రావడంతో.. ఈసారి మిస్ చేయకూడదని వెంటనే ఓకే చెప్పిందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం అనసూయ తెలుగు సినిమాలతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటిస్తుంది. ఇప్పుడు పవర్ స్టార్ పాన్ ఇండియా మూవీలో నటించే ఛాన్స్ రావడం విశేషం. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ విన్నర్ లో ప్రత్యేకగీతంలో నర్తించిన అనసూయ .. ఆ తర్వాత రామ్ చరణ్ ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా మంచి పేరు తెచ్చుకుంది .. ఇప్పుడు పవర్ స్టార్ పీరియాడికల్ మూవీలో ప్రధాన పాత్ర పోషించనుండడం ఆసక్తి రేపుతోంది. త్వరలో చిరు సరసన కూడా అనసూయ నటించినా ఆశ్చర్యపడనక్కర్లేదు. మరి పవర్ స్టార్ మూవీలో అనసూయ ఎలాంటి పాత్ర చేస్తుందో చూడాలి.
Must Read ;- మలయాళ సినిమాలో ఎంట్రీ ఇస్తోన్న స్టార్ యాంకర్











