యూత్ కింగ్ అక్కినేని అఖిల్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రూపొందుతోన్న స్పై థ్రిల్లర్ చిత్రం ఏజెంట్. ఈ చిత్రాన్ని సక్సస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా పై క్యూరియాసిటీ ఏర్పడింది. ఇక ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఆకాశమే హద్దు అనేలా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే… కరోనా థర్డ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆలస్యం అయ్యింది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఆగిందని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఏజెంట్ మూవీ ఆగిందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే… ఈ సినిమాను స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులు ఇక్కడ షూటింగ్ చేశారు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లారు. సగంలోనే వెనక్కు రావాల్సి వచ్చింది. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన స్క్రిప్ట్ లో ఛేంజెస్ అనే వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా చిన్న చిన్న మార్పులు కాదు, ఏకంగా స్క్రిప్ట్ లో భారీ మార్పులే చేయాల్సి వస్తుందని తెలిసింది.
నాగార్జున ఇటీవల ఫుల్ బిజీగా ఉన్నారు. తన పనులు అన్నీ ఫినిష్ చేసుకుని ఫ్రీ అయిన హీరో నాగ్ స్క్రిప్ట్ గురించి అంతా తెలుసుకుని అసంతృప్తి వ్యక్తం చేశారట. దాంతో స్క్రిప్ట్ ను మళ్లీ వండే పనిలో పడ్డారని టాలీవుడ్ లో బలంగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను హీరో అఖిల్ రెమ్యూనిరేషన్ లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. రెమ్యూనిరేషన్ లేకపోవడం ప్లస్ అయినప్పటికీ.. ఇలా స్క్రిప్ట్ ను ముందుకు వెనక్కు మారుస్తూ, ఒకటి రెండు సార్లు సవరిస్తూ వుంటే ఆ డబ్బులు కాస్తా వడ్డీలకు వర్కింగ్ డేస్ కు సరిపోతాయేమో? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి.. ఏజెంట్ కథ పై కసరత్తు ఎప్పటికీ పూర్తవుతుందో..? ఎప్పుడు థియేటర్లోకి వస్తాడో..? క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.











