‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఈ సినిమా పేరు హీరోగా అక్కినేని అఖిల్ కే కాదు అతని నిజజీవితానికీ వర్తిస్తుంది. ఎప్పుడు హిట్ వస్తుందో, ఎప్పుడు పెళ్లి అవుతుందో అన్నట్లుగా ఉంది అఖిల్ జీవితం. అన్నట్లు ఈ బ్యాచిలర్ ఓ ధనవంతుల అమ్మాయితో ‘మ్యాచ్’ ఫిక్సింగ్ చేసుకోబోతున్నాడా? అందులో ఎంత నిజముందోగాని ఓ ప్రేమ పురాణం మాత్రం సాగుతున్నట్లు ఫిలింనగర్ వర్గాల భోగట్టా. ఆ మధ్య ఓ ధనవంతుల అమ్మాయితో నిశ్చితార్థం జరిగి చివరికి అక్కడితో ఆగిపోయింది. అప్పట్నుంచీ ఇంట్లో కూడా ఎవరూ అఖిల్ పెళ్లి ఊసు ఎత్తలేదు. మళ్లీ ప్రేమ వార్తలు గుప్పుమనడంతో ఇంట్లోవారు పెళ్లి మాట ఎత్తుతారా లేదా అన్నది సందేహమే.
ఎందుకంటే అతనికి హిట్ వస్తే గాని ఇంట్లో పెళ్లి తలపెట్టేలా లేరు. ఆ హిట్ కోసం అఖిల్ గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ’తెరకెక్కుతోంది. ఈ సినిమాని హిట్ చేయడానికి ఎంతఖర్చయినా వెనుకాడకుండా చేస్తున్నారు. సినిమా తీయడం వరకే మన చేతుల్లో ఉంటుంది కానీ హిట్ మన చేతుల్లో ఎలా ఉంటుంది. అఖిల్ ప్రేమ వ్యవహారం పట్ల ఇంట్లో అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ముందు హిట్ కొట్టు.. ఆ తర్వాతే పెళ్లి మాట ఎత్తు అని ఇంట్లో ఖరాకండీగాచెప్పినట్లు సమాచారం. ముందు ఈ సినిమాతో హిట్ కొట్టగానే అఖిల్ పెళ్లి కూడా జరిగేటట్టు కనిపిస్తోంది.











