తమిళ టీవీ నటి విజే చిత్ర ఆత్మహత్య అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. అది హత్యా ఆత్యహత్యా? అనే విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. తమిళనాడులో ఆమెకు చాలామంది అభిమానులు ఉన్నారు. మొదటి చిన్న పాత్ర ద్వారా ఆమె నటిగా రంగ ప్రవేశం చేసినా పాండ్యన్ స్టోరీస్ ద్వారా ఆమె మంచి పేరు సంపాదించుకుంది. ఆమె వయసు 28 ఏళ్లు. చెన్నైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. 2013లో ఆమె పీపుల్స్ టీవీలో వాట్ ది లా సేస్ వ్యాఖ్యాతగా టీవీ రంగ ప్రవేశం చేసింది.
లిటిల్ డాడీ, బిగ్ డాడీ సిరీస్‌లో సన్ టీవీ కోసం నటించింది. డ్యాన్స్ షోల ద్వారా ఆమెకు మంచి పేరు వచ్చింది. అలా ఆమెకు భారీగా అభిమానులు పెరిగారు. ఆమెకు పెళ్లి కుదిరిందనే వార్తలు కూడా ఇటీవల వచ్చాయి. ఆగస్టులో నిశ్చితార్థం కూడా జరిగింది. ఆమెను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు హేమంత్ రవి. ఈ పరిస్థితుల్లో ఆమె ఆత్మహత్య చేసుకోవడం అనేక అనుమానాలకు అవకాశమిచ్చింది.
పైగా ఆమె తన కాబోయే భర్తతోనే ఈ హోటల్ లో ఉంటున్నట్టు సమాచారం. తను షూటింగులకు కూడా ఇక్కడి నుంచే వెళుతోందట. అర్థరాత్రి 2.30 గంటల సమయంలో స్నానానికి వెళ్లి బాత్ రూమ్ నుంచి బయటికి రాకపోవడంతో కాబోయే భర్త హేమంత్ హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. డూప్లికేట్ తాళంతో తలుపులు తెరవగా ఆమె ఫ్యాన్ కు వేలాడుతున్నట్టు కనిపించింది. అసలేం జరిగిందనేది హేమంత్ కు మాత్రమే తెలుసు. అతని మాటల్లో నిజానిజాలు ఏమిటన్నది కూడా తేలాల్సి ఉంది.
Must Read ;- ప్రాణాల మీదకు తెచ్చిన ప్రేమ.. నిరాకరించిందని యువతి గొంతు కోసిన ప్రియుడు