జడ్పీ చైర్మన్ మల్కిరెడ్డి సుబ్బారెడ్డి రాజీనామా .. జిల్లాలో తీవ్ర చర్చా!
కర్నూలు జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జడ్పీ చైర్మన్ మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి రాజీనామా చేశారు. వైసీపీలో బంధు బంధు ప్రీతి పెద్దపీట వేయడం, పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న నాయకులకు అన్యాయం చేయడం అధికార వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అన్నది అందరికి తెలిసిందే! అదే విషయం సుబ్బారెడ్డి రాజీనామాతో తేటతెల్లమైంది. చైర్మన్ పదవి బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మద్దతుగా ఉన్న కొలిమిగుండ్ల జెడ్పిటిసి ఎర్రబోతుల పాపిరెడ్డికే దక్కే అవకాశాలు ఉన్నాయని పార్టీ లో చర్చా! పార్టీ నాయకత్వం వెంకటసుబ్బారెడ్డి రాజీనామా చేసేందుకు పట్టుబట్టడంతో ఆయన పదవీ బాధ్యతలకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. సుబ్బారెడ్డికి పదవీ కట్టపెట్టి కనీసం రెండు నెలలు కూడా గడవకమునుపే ఇటువంటి నిర్ణయం తీసుకోవడమేమిటని జిల్లాలు చర్చ సాగుతోంది. శుక్రవారం జిల్లా కలెక్టర్ సుబ్బా రెడ్డి రాజీనామా పత్రాన్ని అందజేశారు.
సుబ్బారెడ్డి రాజీనామా వెనుక అసలు కారణాలివేనా!
జిల్లా పరిషత్ ఎన్నికల సమయంలో చైర్మన్ పదవిని ఎర్రబోతుల వెంకటరెడ్డికి ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. కొలిమిగుండ్ల జడ్పీ స్థానం నుంచి వెంకట్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోవిడ్ కారణంగా ఆయన మరణించడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో సుబ్బారెడ్డిని జడ్పీ చైర్మన్ గా పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఈ నేపధ్యంలో మొన్న జరిగిన మినీ లోకల్ ఎలక్షన్స్ లో కొలిమిగుండ్ల స్థానం నుంచి వెంకటరెడ్డి కుమారుడు పాపిరెడ్డి గెలుపొందారు. ఈ క్రమంలో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సుబ్బారెడ్డితో రాజీనామా చేయించి, పాపిరెడ్డికి పదవీ ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో సుబ్బారెడ్డి రాజీనామా చేయక తప్పలేదు. సాధారణంగా పదవి ఇచ్చిన వారికి కనీస గౌరవ ప్రదంగా ఏడాదిపాటైనా కొనసాగింపు అనేది రాజకీయాల్లో కామన్! అటువంటిది రెండు నెలలు గడవక ముందే సుబ్బారెడ్డిని రాజీనామా చేయించడం ఏమిటని పొలిటికల్ సర్కిల్స్ లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార వైసీపీలో ఎర్రబోతుల వెంకటరెడ్డి కుటుంబానికి చాలామంది బంధువులు ఉన్నారు. అందుకే బంధుప్రీతికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పార్టీ కోసం పాటుపడే సుబ్బారెడ్డికి అధిష్టానం అన్యాయం చేసిందని సొంత పార్టీ వర్గంలో వారే గుసగుసలాడుకుంటున్నారు.











