ఏపీలో రాజకీయ పరిస్థితులు సామాన్యుడికి సైతం స్పష్టంగా అర్థమవుతున్నాయి. కుట్రపూరిత రాజకీయాలకు జగన్ పాలన వేదికైందన్న అంశం అందరికీ తెలిసిందే. ఆర్థరాత్రి చంద్రబాబును అరెస్ట్ చేసి ఏపీలో అరాచకానికి తెర తీసిన జగన్ సాధించిందేమిటో ఈ పాటికి జనానికి అర్థమై ఉంటుంది. సామాన్యుడి నుంచి తలపండిన రాజకీయ నేతలు సైతం జగన్ కుట్ర రాజకీయాలను తప్పుబడుతున్నారు. చంద్రబాబు అరెస్టయి నెల రోజులైంది. సోమవారం తీర్పుల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు రావటం ఖాయం. అయితే అహంకార ధోరణి, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో జగన్ ఈ నెల రోజుల్లో కూడగట్టుకున్న అపఖ్యాతి ఆయనకు చేదు జ్ఞాపకాలనే మిగల్చబోతోందని స్పష్టమవుతోంది.
చంద్రబాబు అరెస్టయ్యాక ఢిల్లీ వెళ్లొచ్చిన జగన్ కేంద్రం నుంచి ఊహించని పరిణామాలు ఎదుర్కొన్నారు. అసలు ఎందుకీ ఆకస్మిక నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని జగన్ తో మాట్లాడిన ప్రతి బీజేపీ నేత తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఊహించని ఈ పరిణామంతో బిత్తరపోయిన జగన్ పెండింగ్ ఫైళ్లు, నిధుల ప్రస్తావ కూడా తేకుండానే తాడేపల్లి బయల్దేరారు. చంద్రబాబు లాంటి సీనియర్ నేతను అరెస్ట్ చేయట వల్ల పార్టీలోనూ జగన్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు బయటకు చెప్పకపోయినా చంద్రబాబుతో జగన్ అలా వ్యవహరించి ఉండాల్సింది కాదన్న అభిప్రాయంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఓట్ల కోసం జనం ముందుకెలా వెళ్లాలో అని అంతర్మథనం చెందుతున్నారు. అన్నేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన టీడీపీ అధినేతతో జగన్ సర్కారు అనుసరించిన తీరును ప్రజలంతా అసహ్యించుకున్నారు. జగన్ వైఖరి నచ్చక చాలా మంది సొంత పార్టీ అభిమానులే ఆయనకు దూరమయ్యారు.బద్ద శత్రువుల్లా ఉండే చంద్రబాబు, వైఎస్ హయాంలోనూ ఇలాంటిది జరగలేదనకున్న వారూ లేకపోలేదు.
చంద్రబాబు అరెస్ట్ తో కొరివితో తలగోక్కోవటమంటే ఏమిటో జగన్‌కు వచ్చే ఎన్నికల్లో తెలిసి రావటం ఖాయం. మొత్తానికి పిచ్చి సలహాలు పాటించి చంద్రబాబును అరెస్ట్ చేయించిన జగన్‌కు అటు కేంద్రం నుంచి ఇటు పార్టీ నుంచి తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొనాల్సిన పరిస్థితి తప్పలేదు. మునుముందు పార్టీలో అసంతృప్తి పెరిగి కొంత మంది నేతలు వైసీపీకి దూరమైనా ఆశ్చర్యపోనవసరం లేదు.