2024 సార్వత్రిక ఎన్నికలకు సన్నాహాలు చేస్తూ చర్చల మీద చర్చలు జరుపుతున్న భారతీయ జనతా పార్టీకి ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. దక్షిణాదిన కర్ణాటకను చేజార్చుకున్నట్టే.. కంచుకోటలుగా బీజేపీ భావిస్తున్న ఉత్తరాది రాష్ట్రాల్లోనూ బలహీనతలు బయటపడ్డాయి. ఇంటిలిజెన్స్ నివేదికలు, సొంత సంస్థల సర్వేలు ఇదే అంశాన్ని స్పష్టంగా తేల్చేశాయి.
ఉత్తరాదిలో పడిపోతున్న బీజేపీ గ్రాఫ్ పడిపోతోందని ఆ సంస్థల నివేదికల సారాంశం. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల్లో
నూ బీజేపీపై నెగెటివ్ ఎఫెక్ట్ ఉందని సొంత సంస్థలే తేల్చేశాయి. ఊహించని ఈ పరిణామంతో షాక్ తిన్న బీజేపీ నేతలు 2024 ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవటానికి ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలో అన్న మేథోమథనాన్ని మొదలుపెట్టాయి. ఉత్తరాదిలో బలం పెంచుకోవటానికి అనుసరించాల్సిన నిర్ణయాలతో పాటు దక్షిణాదిలోనూ బలం పెంచుకోవటం ద్వారా కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టేయచ్చని బీజేపీ హైకమాండ్ ఆలోచన.
దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి వీస్తున్న ఎదురుగాలి, ఆ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలు, కుట్ర రాజకీయాలను బీజేపీ పెద్దలు సమగ్రంగా విశ్లేషించారు. ఈ కారణాలతో జగన్ ఎలా ప్రజలకు దూరమవుతున్నాడో కూడా బీజేపీ పెద్దలు ఓ అవగాహనకు వచ్చారు. కొత్త మిత్రుల వేట మొదలు పెట్టారు. ఒకప్పటి మిత్రుడు, జాతీయ రాజకీయాల్లో ఆరితేరిన ఉద్దండుడు చంద్రబాబుకు చేరువవడం వల్ల ప్రయోజనాలను బీజేపీ పరిగణనలోకి తీసుకుంది. తెలుగుదేశం పార్టీకి దగ్గరై జత కడితే జనసేన బలం కూడా తోడైతే కనీసం 20 ఎంపీ స్థానాలను పదిలంగా ఉంటాయని బీజేపీ పెద్దల వ్యూహం. ఈ వ్యూహాన్ని అమలు చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కోసం బీజేపీ హై కమాండ్ ఓ గోల్డెన్ ఆఫర్ ను సిద్ధం చేసిందని పొలిటికల్ ఎక్స్ పర్ట్స్ అంచనా.