ఎట్టకేలకు నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ పట్టాలెక్కింది. ఇప్పటికే ఈ సినిమా 70 శాతం షూటింగును పూర్తిచేసుకున్నా కరోనా కారణంగా ఆగిపోయింది. ఈ సినిమాను త్వరగా పూర్తిచేయాలన్న సంకల్పంతో నాగార్జున మళ్లీ మొహానికి రంగేసుకున్నారు. ఇందులో నాగార్జున డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నారు.
దీని ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వచ్చేసింది. నాగ్ కు సహాయకులుగా మరో ఐదుగురు అధికారులు ఉంటారు. ఓ లేడీ ఆఫీసర్ ఇందులో ఉంటుందన్నమాట. ఈ సినిమా ద్వారా అహిషోర్ సోల్‌మన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు కిరణ్ కుమార్ మాటలు అందిస్తున్నారు. నాగార్జునకు జోడిగా దియా మీర్జా నటిస్తోంది. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది.