అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీకపూర్ ని టాలీవుడ్ లో పరిచయం చేయాలని టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. అయితే.. జాన్వీ మాత్రం నో చెబుతోంది. లైగర్ మూవీలో విజయ్ సరసన జాన్వీకపూర్ అయితే బాగుంటుంది అనుకున్నారు. ఈ సినిమాకి కరణ్ జోహర్ ప్రొడ్యూసర్ కాబట్టి జాన్వీ కపూర్ నటించడం ఖాయం అనుకున్నారు. అయితే… ఏమైందో ఏమో కానీ నో చెప్పింది. ఆ తర్వాత అనన్య పాండేని ఎంపిక చేశారు.
ఆతర్వాత చరణ్, ఎన్టీఆర్ సినిమాల కోసం జాన్వీ కపూర్ ని ప్రయత్నించినప్పటికీ ఓకే చెప్పలేదు. తాజాగా ఎనర్జిటిక్ హీరో రామ్.. ఊర మాస్ డైరెక్టర్ శ్రీను కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో నటిస్తే.. నార్త్ లో ఈ సినిమాకి మంచి బజ్ వస్తుందని బోయపాటి జాన్వీని కాంటాక్ట్ చేశారట.
అయితే.. ఈ అమ్మడు కథ వినకుండానే నో చెప్పిందట. ఇలా వరుసగా తెలుగు ఫిల్మ్ మేకర్స్ జాన్వీని కాంటాక్ట్ చేయడం.. ఆమె నో చెబుతుండడంతో ఈ అమ్మడు పై విమర్శలు వస్తున్నాయి. తెలుగు సినిమాలను జాన్వీ కపూర్ అవమానించినట్లగా వ్యవహరిస్తోంది అంటూ కొందరు ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సినిమాలో విజయ్ సరసన జాన్వీ నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి.. ఈ సినిమాకైనా ఓకే చెబుతుందో..? లేక నో చెబుతుందో..? అనేది ఆసక్తిగా మారింది.











