దాడికి యత్నంచిన వైసీపీ..!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ రౌడీ రాజకీయాలకు తెరతీసింది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి వ్యక్తి చంద్రబాబు! ఆయనకే రాజకీయాలు నేర్పాలని వైసీపీ ప్రయత్నిస్తోంది కాబోలు.. అందుకే చీప్ ట్రిక్స్ పాల్పడుతోంది! కుప్పం మండలం గరికదిన్నేపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన సభలోకి వైసీపీ కార్యకర్తలు దూసుకువచ్చారు. అలజడి సృష్టించాలని ప్రయత్నించారు. దీంతో చంద్రబాబుతో పాటు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్ది, జ్ఞానం ఉందా.. అంటూ వైసీపీ కార్యకర్తలపై చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ కావాలనే ఇలా నాటకాలకు తెరతీస్తోందని మండిపడ్డారు. వైసీపీ సభలు నిర్వహించే సమయంలో టీడీపీ ఎప్పడైనా ఇలా వచ్చిందా? అంటూ ప్రశ్నించారు. రాజకీయాలు హుందాగా ఉండాలని, నీచపు సాంప్రదాయాలకు తెరతీయ్యకండని చంద్రబాబు హెచ్చరించారు.
గతంలో కూడా చంద్రబాబుపై దాడికి యత్నం..!
గతంలో కూడా చంద్రబాబు కుప్పం పర్యటనలో వైసీపీ కార్యకర్తలు హల్చల్ సృష్టించిన సంగతి తెలిసిందే! రాళ్లు, కర్రలతో ఓ వైసీపీ కార్యకర్త వచ్చాడు. దీంతో బాంబు తెచ్చారంటూ.. టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు కుప్పం పర్యటనకు వస్తే.. ఆయనపై బాంబు వేస్తానని వైసీపీ నేత సెంధిల్ కుమార్ హెచ్చరించడంతో అందరూ భయపడ్డారు. ఇలా జగన్ రెడ్డి ప్రతిపక్షనేత చంద్రబాబుపై కక్ష్య సాధింపు చర్యకు పాల్పడం సబబు కాదని కుప్పం ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.











