‘అంతకుముందు ఆ తర్వాత’, ‘అరవింద సమేత’ ‘అ!’ సినిమాలతో తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో ‘రాగల 24 గంటలలో’ సినిమాతో తనలోని వేరే కోణాన్ని కూడా ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ కోవలోనే వెబ్ సిరీస్ ‘లవ్ స్టోరీస్’లో బోల్డ్ గా నటించిన ఈ భామ మరోమారు ఇలాంటి తరహా పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. దర్శకుడు సంపత్ నంది ఓ వెబ్ సిరీస్ తీసేందుకు సిద్దమయ్యాడు. హైదరాబాద్ నైట్ లైఫ్ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ఉండనుంది. ఈ సిరీస్ కు ఈషా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
ఈ వార్తల నేపథ్యంలో ఆమె తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ” ఈ రోజులలో నైట్ లైఫ్ మనం చూడలేము. కరోనా తీవ్రత నేపథ్యంలో #stayhome #staysafe” అంటూ ట్వీట్ చేసింది. కరోనా నేపథ్యంలో ఎటువంటి షూటింగులు లేవనే ఉద్దేశంతో ఆమె ఈ ట్వీట్ చేసిందని అర్ధమవుతోంది. కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సోషల్ అవేర్ నెస్ వీడియోలలో నటించారు. ఆ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి, కార్తికేయలతో కలిసి ఆమె నటించారు.
There is no night life these days to show! So, stay home, stay safe 🤘 https://t.co/RiaUIMI3Rt
— Eesha Rebba (@YoursEesha) August 15, 2020