తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర భీమవరంలో సాగుతోంది. పాదయాత్రకు వస్తున్న ఆధారణ చూసి వైసీపీ మూకలు లోకేష్ పై రాళ్ళదాడికి దిగారు. దీంతో భీమవరం ఇరుపార్టీల నినాదాలతో దద్దరిల్లిపోయింది.
యువనేత నారా లోకేష్ 205 రోజు పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సాగుతోంది. ఆక్వారైతుల గోడు విన్న లోకేష్ .. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అన్నీ విధాలుగా ఆదుకుంటామని హామి ఇచ్చారు. ఆ తరువాత స్థానిక ప్రకాశం చౌక్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జగన్ చేస్తున్న అకృత్యాలను ఎండగట్టారు. స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చేస్తున్న అవినీతి.., భూ మాఫియా.., అనేక కుంభకోణాలపై సాక్ష్యాదారాలతో సభ వేదికగా నిలదీశారు లోకేష్. ఆ తరువాత వేలాది కార్యకర్తల నడుమ పాదయాత్ర తాడేరు వంతెన వద్దకు చేరుకుంది. అప్పటికే వైసీపీ శ్రేణులు ఫుట్ గా మద్యం సేవించి కూలిడ్రింక్స్ బాటిల్స్, రాళ్ళు, కర్రలతో పాదయాత్రలోని టీడీపీ శ్రేణులపై విరుచుకు పడ్డారు.
ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు ఎదురుదాడికి దిగారు. వైసీపీ శ్రేణులను పోలీసులు వారించారు. కానీ అదే సమయం టీడీపీ శ్రేణులపై లాఠీ చార్జ్ చేశారు. రాళ్ళ దాడితో కవ్వించిన వైసీపీ వారిని వదిలేసి.. ఇలా తమపై లాఠీ చార్జ్ చేయడం ఏమిటని..? టీడీపీ శ్రేణులు పోలీసులను నిలదీశారు. ఇదంతా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అనుచరగణమే చేసిందని పోలీసుకు ఫిర్యాదు చేశారు. లోకేష్ బహిరంగ సభలో ఎమ్మెల్యే అవినీతి చిట్టాను సాక్ష్యాధారాలతో బహిర్గతం చేసినందుకే ఈ దాడికి దిగారన్నది స్పష్టమౌతోంది.
ఈ దాడిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు, పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వీరితోపాటు కానిస్టేబుల్.., ఎఎస్ఐ లకు సైతం గాయాలయ్యాయి. లోకేష్ చుట్టు ఉన్న భద్రత సిబ్బంది అలర్ట్ అయ్యి బులెట్ ఫ్ర్యూఫ్ జాకెట్లును అడ్డుగా పెట్టారు. ఇలా భీమవరంలో వైసీసీ మూకలు బీభత్సం సృష్టించాయి. ఈ దాడి మొత్తంగా పోలీసులు వ్యవహరించిన తీరును తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుపడుతున్నారు.
ప్రతిపక్ష నేత పాదయాత్ర చేస్తున్న క్రమంలో ఎటువంటి అల్లర్లు జరిగినా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ తలెత్తి పుంగనూరు అంగళ్ళు మాదిరిగా రణరంగం అవుతుందన్న కనీస ఇంగితం లేకుండా పోలీసులు వ్యవహరించిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. అంతక ముందు ప్రకాశం చౌక్ వద్ద లోకేష్ బహిరంగ సభకు వెనుక భాగంలో వైసీపీ పెద్ద పెక్ల్సీ కట్టి కవ్వింపు చర్యలు దిగింది. పేదలకు.. పెత్తందారుల యుద్ధం అని ప్లెక్సీ ఏర్పాటు చేసిన వైసీపీ మూకలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అప్పుడే వారిపై చర్యలు తీసుకుంటే.. తాడేరు వంతెన వద్ద రాళ్ళ దాడి జరిగి ఉండేది కాదని పోలీసులు తీరును టీడీపీ పార్టీ నేతలు ఎండగడుతున్నారు. కనీస ఇంటలీజెన్సీ సూచనలను కూడా పాటించకుండా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.