సరిగ్గా వారం క్రితం విశాఖ లోని బస్ షెల్టర్ కుప్ప కూలింది. దీనిపై విపక్షాలు.., స్థానికులు నాణ్యత లోపాలపై దుమ్మెత్తిపోశారు. అది మరవక మునిపే నిన్న పులివెందులలో నూతనంగా నిర్మించిన బస్ టెర్మినల్ వర్షపు నీటికి పగుళ్ళొచ్చి..నీరు లీకవ్వడం మొదలైంది. దీనిపై సర్వత్రా విమర్శలకు దారి తీసింది.
జగన్ రెడ్డి అంటేనే ఫేక్ రాజకీయాలకు.., హామీలకు పెట్టింది పేరు. ఇది ప్రజలంటున్న మాటే. రాజకీయాలే ఇలా ఉంటే.. ఆయన ప్రభుత్వంలో జరుగుతున్న నిర్మాణాలు కూడా అంతే. నాణ్యత లోపాలకు గీటురాయిగా మారిన నిర్మణాలు కూలుతున్నాయి. 2019, జూన్ 25 న ప్రజావేదికను కూల్చి విధ్వాంసాల ముఖ్యమంత్రిగా మార్క్ వేసుకున్న జగన్.. నేటికీ ఏపీ లో తట్టెడు సిమెంట్ తో పది ఇటుకలు పేర్చి ఏ ఒక్క నిర్మాణం చేపట్టిన పాపానపోలేదు. రాజధాని నిర్మాణం గాలికొదిలేసి.. మూడు రాజధానులంటూ ఊరేగాడు. కానీ.., ఎక్కడ ఒక్క నిర్మాణం పూర్తి చేసి.. పాలనను గాడిలో పెట్టలేకపోయిన అసమర్థ ముఖ్యమంత్రిగా బాగానే అపకీర్తిని మూటగట్టాడు జగన్.
మరోవైపు నాశిరకం.., నాణ్యత లోపాలతో నిర్మించిన కట్టడాలు కుప్పకూలిపోతున్నాయి. ఆ మొన్న విశాఖలో బస్ షెల్టర్ల కుప్పకూలింది. అధునాతన బస్ షెల్టర్ల పేరుతో కలరింగ్ ఇచ్చి.. 40 లక్షలతో నిర్మించిన బస్ షెల్టర్ ఒక్కసారిగా కుప్పకూలింది. మహా విశాఖ నగరపాలక సంస్థ పరిథిలో 4.62 కోట్లతో 20 ప్రాంతాల్లో నవరత్నాల ప్రచార పోస్టర్లు అతికించి బస్ షెల్టర్లు ను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. కానీ.., నాణ్యత లోపం వారి ఆశను చూసి వెక్కిరించింది. డొల్లతనం ఒక్కసారిగా బయటపడి.. కుప్పకూలిన బస్ షెల్టర్ కు అక్షరాల 40 లక్ష ప్రజాధనాన్ని వెచ్చించారని అధికారిక లెక్కలు చెప్తున్నాయి.
మరోవైపు నిన్న పులివెందులలో దాదాపు 22.50 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన బస్ టెర్మినల్ భవనానికి బీటలు పారాయి. చిన్నపాటి వర్షానికి భవనానికి ఏర్పడిన బీటలు నుంచి వర్షపు నీరు లీకైంది. జగన్ సొంత ఊళ్ళో నిర్మించి బస్ టెర్నినల్ లో అనేక నాణ్యత లోపాలు దొర్లినా.. దానిపై నేటికీ ముఖ్యమంత్రి స్థాయిలో జగన్ స్పందించకపోవడంపై పలు విమర్శలకు తావిస్తున్నాయి. పోయిన ఏడాది డిసెంబర్ జగన్ రెడ్డి ప్రారంభించిన ఈ టెర్మినల్ ఆ తరువాత మార్చి లో కూరిసిన వర్షాలకే గోడుల వెంబటి చెమ్మ బయటకొచ్చి..నాణ్యత లోపాలను ఎత్తిచూపింది. పులివెందుల్లో శనివారం కురిసిన భారీ వర్షం కురిసింది. దీంతో భవనంలో ఏర్పడిన లీకులు ద్వారా వర్షపు నీరు కిందికి వచ్చింది.
ఈ క్రమంలో కూల్చడం తెలిసిన ముఖ్యమంత్రికి.. కట్టడం ఏం తెలుసనని..? నెటిజన్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. నాణ్యత లోపాలను సరిచేసి.. ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న ముఖ్యమంత్రే.. తన సొంత నియోజకవర్గంలో ఇలా నాశిరకం కట్టడాలు కడుతుంటే రాష్ట్రంలోని నిర్మాణాల పరిస్ధితేంటి..? అని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఇప్పటికైన సిగ్గు తెచ్చుకుని సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.