సమస్యలు పరిష్కరించాలని కోరిన మహిళలపై చిందులేశారు విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి. విజయనగరం నగర పాలక సంస్థ పరిధిలోని కేఎల్ పురంలో ఎమ్మెల్యే పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఆయనను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. వీధిలోని డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ఓ మహిళా కోరగా ఎమ్మెల్యే ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అదేసమయంలో స్థానిక మహిళలు సమస్యను వివరించే ప్రయత్నం చేసినా ఆయన కనీసం వారి మాటలు కూడా వినే ప్రయత్నం లేదు. తమాషా చేస్తున్నారా? మేము ఇక్కడకి సరదాకి వచ్చామనుకుంటున్నారా ? కూర్చో అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తమ వీధిలో మురుగు కాల్వ సమస్య ఉందని, పరిష్కరించాలని నగర పాలక సంస్థ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేయగా ఆయన వ్యవహరించన తీరు తమని బాధించిందని, ఎమ్మెల్యే వ్యవహార శైలి పై మండిపడ్డారు.