గత ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్.. ఉద్యోగులకి భారీ హామీలు గుప్పించారు.. అరచేతిలో వైకుంఠం చూపించారు.
సీపీఎస్ రద్దు చేసి భారీగా లబ్ది చేకూరుస్తామని, చంద్రబాబు సర్కార్ కంటే భారీ మేలు చేకూరుస్తామని హామీలు గుప్పించారు జగన్. వైసీపీ అధినేత ఇచ్చిన హామీలను నమ్మి.. ఉద్యోగులంతా ఆయన వెంట పయనించారు.. ఆయనకే జై కొట్టారు 2019 ఎన్నికలలో అనే విశ్లేషణలు సాగాయి.. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు అని ప్రకటించి అధికారంలోకి వచ్చిన జగన్.. ఎన్నికలకు మరో నాలుగు వారాలు మిగిలి ఉందనగా కొత్త కల్లిబొల్లి కబుర్లు చెప్పడం మొదలు పెట్టారు.. సీఎపీఎస్ రద్దుపై తాము సరయిన నివేదిక లేకుండా హామీ ఇచ్చామని, తాము అన్ని లెక్కలు వేసుకున్న తర్వాత అది సాధ్యం కాదని, తమవైపు తప్పు జరిగిందని ఆయన నిర్మొహమాటంగా మాట ఇచ్చి తప్పారు..
జగన్ అక్కడితో ఆగలేదు.. ఉపాధ్యాయులకి చుక్కలు చూపించారు. నాన్ టీచింగ్ విధులు వేసి వారిని నడిరోడ్డుపై నిలబెట్టారు.. ఇటు, ఉద్యోగులను నిలువునా మోసం చేశారు జగన్.. పీఆర్‌సీ వేసి వారికి అప్పటికే అందుతున్న గ్రాస్ శాలరీ కంటే తక్కువ వచ్చేలా చేసి వారిని మాయ చేశారనే వాదన ఉంది. ఏకంగా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల సర్వీస్ అకౌంట్లలోని డబ్బులు ప్రభుత్వ పథకాలకు వాడుకొని వారిని ఇబ్బందులలోకి నెట్టారు.. ఇలా, ఉద్యోగులకు జగన్ చేసిన మోసాలు అన్నీ ఇన్నీ కావు..
ఎన్నికలు సమీపిస్తుండడంతో జగన్ మరోసారి కొత్త హామీలు ఇవ్వడం మొదలుపెట్టారు.. ఉద్యోగులకి రెండు డీఏలు ప్రకటించారు జగన్.. మొదట విడత డీఏ ఏప్రిల్ నెల నుండి స్టార్ట్ అవుతుందని, రెండో విడత జూన్ నుండి క్రెడిట్ అవుతుందని హామీ ఇచ్చారు.. ఇన్ని రోజులూ ఉద్యోగులని ముప్పుతిప్పలు పెట్టి తాజాగా అక్కున చేర్చుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.. అయిదేళ్లుగా ఉద్యోగులు నరకం చూశారు వైసీపీ ఏలుబడిలో..
ఇప్పటికే జగన్ పాలనపై విసిగిపోయిన ప్రజలు.. టీడీపీకి చేరువయ్యారు. 2019 ఎన్నికలలో తాము చేసిన తప్పును తెలుసుకున్నారు.. వైసీపీకి బుద్ధిచెప్పడానికి రెడీ అయ్యారని పలు సర్వేలు తేల్చి చెబుతున్నాయి.. అందుకే, కొంత డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి డీఏతో డ్రామా మొదలుపెట్టారని భావిస్తున్నారు. మరి, ఈ దఫా ఉద్యోగులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..