ప్రపంచంలోని చాలా దేశాల్లో తొలి టీకాగా గుర్తింపు పొందిన ఫైజర్ ను తయారుచేయడానికి ఉపయోగించిన ఎంఆర్‌ఎన్‌ఎ టెక్నాలజీ వెనక ఆమె కృషి అనిర్వచనీయం. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాను కట్టడి చేయడానికి బ్రిటన్-అమెరికా ఎంచుకున్న అస్త్రం ఫైజర్. మరి అందులో ఏదో గొప్పతనం ఉంటే తప్ప ఇన్ని దేశాలలో ఆమోదం పొందడం సాధ్యం కాదు. మరి దాని వెనకున్న గొప్పతనం ఏమిటి? అది వైరస్ లను కట్టడి చేయగల ఎంఆర్‌ఎన్‌ఎ టెక్నాలజీని ఉపయోగించి తయారుచేసిన టీకా. కానీ ఇదే టెక్నాలజీని ఒకప్పుడు తిరస్కరించారని మీకు తెలుసా? దీని సృష్టికర్తకు ప్రమోషన్‌కి బదులు డిమోషన్‌తో సత్కరించారిన తెలుసా? ఎంఆర్‌ఎన్‌ఎ టెక్నాలజీని కనిపెట్టడంలో అంతటి కృషి చేసిన కాటలిన్ కథేమిటో తెలుసుకుందాం రండి..
సరిగ్గా పాతికేళ్ల తర్వాత వాటి ఫలాలు కరోనా వ్యాక్సిన్ తయారీలో ఉపయోగపడ్డాయి. హంగేరీకి చెందిన కాటలిన్. 1985లో తన కారును అమ్మేసి. 1200 అమెరికా డాలర్లతో భర్త, రెండేళ్ల కూతురితో కలిసి అమెరికారు చేరుకున్నారు. పెన్సిల్వేనియా వర్సిటీలో ఆధ్యాపకురాలిగా చేరి ప్రొఫెసర్ స్థాయికి ఎదిగారు. 1985లో 40వ పడిలో ఉన్న కాటలిన్.. భవిష్యత్ లో రానున్న కొంగొత్త వైరలను ఎదుర్కొనేలా ఎంబ పై పరిశోధనలు సాగించారు. ఎంతో ముందు చూపుతో ఆమె ప్రారంభించిన ప్రయోగాలు, పరిశోధనలకు సాయం అండకపోగా చీత్కారాలు విమర్శలు ఎదురయ్యాయి.
Must Read ;- భారత్ కోసం ధర సవరించనున్న ఫైజర్
ఏంటీ టెక్నాలజీ?
మన శరీరం సజీవంగా, ఆరోగ్యంగా ఉండడానికి కోట్లాది సూక్ష్మ ప్రొటీన్లపై ఆధారపడి ఉంటుంది కణాలు ఏ ప్రొటీన్లను తయారుచేయాలో చెప్పడానికి ఎంఆర్ఎన్ఏ (అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ)ను ఉపయోగించుకుంటుంది. అంత కీలకమైన ఎంజర్ఎన్ఏ వ్యవస్థను హైజాక్ చేస్తే.. అంటే శరీరానికి బదులు మనమే కృత్రిమ మెసెంజర్ ఆన్‌లను ఉపయోగించి శరీరంలో మనకు కావాల్సిన ప్రొటీన్షను, యాంటీబాడీలను, ఎంజైములను ఉత్పత్తి చేసుకోగలిగితే? అరుదైన వ్యాధులను రివర్స్ చేయగలిగే ఎంజైమ్స్‌ని, దెబ్బ తిన్న గుండె కణాలను బాగు చేసే గ్రోత్ ఏజెంటు, ఇన్ఫెక్షన్లపై పోరాడే యాంటీబాడీలను.. ఇలా దేన్ని కావాలంటే దాన్ని తయారు చేసుకోవచ్చు. అదే ఊహ డాక్టర్ కాటలిన్ కరీకోకు వచ్చింది, దీంతో, తన బృందంతో కలిసి ఎంఆర్ఎస్ఏపై పరిశోధనలు చేశారామె.
కానీ, ఎంఆర్ఎస్ఏపై రోగనిరోధక వ్యవస్థ తీవ్ర దాడి చేస్తుంది. అది మనం నిర్దేశించిన కణాల వద్దకు చేరుకునేలోపే ధ్వంసం చేసేస్తుంది. దీన్ని కారణంగా చూపి ఆమె పరిశోధనకు వర్సిటీ అధికారులు నిధులు ఆపేశారు. పెన్సిల్వేనియా వర్సిటీ అధికారులు ఆమెను ప్రొఫెసర్ స్టాయి నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ ర్యాంకుకు డిమోట్ చేశారు. పరిశోధన సమయంలో ఆమె కేన్సర్ బారిన పడ్డారు. కానీ, వెనుకంజ వేయకుండా ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో పదేళ్లపాటు తన ఆధ్యయనాన్ని కొనసాగించారు. వారి పరిశోధన విజయవంతమైంది. వారు రూపొందించిన సింధటిక్ ఎంటర్ఎన్పార్ రోగనిరోధక వ్యవస్థకు తెలియకుండా తనపని తాను చేయగలిగింది.
కరోనా కల్లోలం సమయంలో ఫైజర్ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారుచేయడం కోసం గత అధ్యయనాలపై దృష్టిసారించారు. అప్పుడు కాటలిన్ పరిశోధన వారిని ఆకర్షించింది. బయో ఎన్ టెక్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ హోదాలో, ఫైజర్ తో కలిసి టీకా తయారీలో పాలుపంచుకున్నారు ‘కాటలిన్ కరీకో’. ఫైజర్ తో కలిసి ఇప్పుడు మొట్టమొదటి వ్యాక్సిన్ తయారు చేసిన బృందంలో భాగస్వాములుగా కీర్తిగడించారు.
Also Read ;- భారత్‌లో ఏ వ్యాక్సిన్‌కి అనుమతులు లభించబోతున్నాయి?