ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం ధరలను పెంచుతుంతే ఒక వ్యక్తి రూ.1కే క్వార్టర్ మద్యంను పంపిణీ చేస్తున్నాడు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ వ్యక్తి తన అభిమాన దర్శకుడు పెళ్లి రోజును పురస్కరించుకుని ఈ మద్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాడు. కేవలం మద్యం పంపిణీ చేయడమే కాదు. భోజనం కూడా పెట్టాడు. మంద్యం పంపిణీకి ఆ అభిమాని పరిమిత టైం కూడా ఫిక్స్ చేశాడు. ప్రముఖ సినీ డైరెక్టర్ ఎన్.శంకర్ పెళ్లి రోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన జిల్లా నేత ఒక రూపాయకే ఒక క్వార్టర్ మందును ఈనెల 16వ తేదీన పంపిణీ చేయనున్నట్లు ఏకంగా బ్యానరే కొట్టించాడు. దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చింతకుంట విష్ణు అనే వ్యక్తి రూ.1కే క్వార్టర్ ఇస్తున్నట్లు ఫ్లెక్సీ కొట్టించిన వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. సినీ దర్శకుడు ఎన్.శంకర్ పెళ్లి రోజు సందర్భంగా ఈ పంపిణీ కార్యక్రమంను విష్ణు చేపట్టాడు. ఈనెల 16న ఇస్తున్నట్లు ఏకంగా బ్యానర్ కొట్టించి ప్రచారం నిర్వహించాడు. అంతేకాకుండా ఈనెల 15న ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి సన్నిధిలో అన్నదానం కార్యక్రమం కూడా చేపట్టాడు. మద్యం పంపిణీకి నో మాస్క్.. నో ఎంట్రీ అనే ఒక షరతు కూడా పెట్టాడు. అలాగే ఈ రోజు చేపట్టే మద్యం పంపిణీ కార్యక్రమానికి 11 గంటల నుంచి 12 గంటల వరకు పరిమిత సమయం కూడా విధించాడు.
రూ.1కే క్వార్టర్ ఇస్తుండంటో పలువురు మద్యం ప్రియులు ఆనందంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమందైతే 1 రూపాయికే క్వార్టర్ మందు ఇస్తున్నావు అంటే నువ్వు దేవుడు సామి… అని కితాబు కూడా ఇస్తున్నారు. మందుబాబుల హృదయలను గెలిచిన నిజమైన నేతగా చింతకుంట విష్ణును అభివర్ణిస్తూ వాట్సప్‌లలో పోస్టులు పెడుతున్నారు. తమ అభిమానాన్ని డిఫరెంట్‌గా చూపించుకోవడం కోసం ఒక్కొక్కరు ఒక్కో దారిని ఎంచుకుంటారనడానికిదే నిదర్శనం.
Also Read ;- హైదరాబాద్‌లో అడుగుపెట్టిన కమల దళం!











