కడప జిల్లా మామిళ్లపల్లె బైరటీస్ గనుల్లో పేలుడు కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి పెదనాన్న వైఎస్ ప్రతాప్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.మామిళ్లపల్లె పేలుడు ఘటనలో పది మంది కూలీలు చనిపోయిన సంగతి తెలిసిందే. వైఎస్ ప్రతాప్‌రెడ్డికి పేలుడు పదార్థాల లైసెన్స్ ఉన్నా,మామిళ్లపల్లెలో గనులకు పేలుడు పదార్థాలు తరలించడం,వాటిని అన్ లోడింగ్ చేయడంతో సరైన నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది.దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా వైఎస్ ప్రతాప్‌రెడ్డిని అరెస్టు చేశారు.
పులివెందుల నుంచే..
మామిళ్లపెల్లె పేలుడు ఘటనలో 150 కేజీల జిలెటెన్ స్టిక్స్ పులివెందుల నుంచి కలసపాడు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.గని పేలుడులో ఇప్పటి వరకు పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.ఈ కేసులో ఎంతటి వారున్నా వదిలేదని లేదని సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన వెంటనే పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేసి ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు.











