ఇప్పటికే చంద్రబాబుపై కర్నూలులో ఓ నాన్ బెయిలబుల్ కేసు నమోదైన సంగతి తెలిసింది. కరోనాపై ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారంటూ చంద్రబాబుపై అనిల్ కుమార్ అనే వ్యక్తి గుంటూరు అరుండల్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా గురించి చంద్రబాబునాయుడు ప్రజలు భయబ్రాంతులకు గురయ్యేలా మాట్లాడారని అనిల్ కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు అరండల్ పేట పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.
కర్నూలు కేసులో తర్జనభర్జన
కర్నూలులో ప్రమాదకర కరోనా వేరియంట్ 440కె వెలుగు చూసిందంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసు నమోదు చేసిన సంగతి తెలసిందే. ఇప్పటికే చంద్రబాబుపై నాన్ బెయిలబుల్, క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీనిపై కర్నూలు పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు సిద్దమై చివరి క్షణంలో వెనక్కు తగ్గారు. తాజాగా గుంటూరులో మరో కేసు నమోదు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కట్టడిలో,కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో విఫలమైన ప్రభుత్వం మీడియాను, ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా కేసులు పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.