సోషల్ మీడియాలో ఊపందుకున్న ఉద్యమం
- సినిమా తారల మరణాలు ఎప్పుడూ సంచలనమే. ఓ పక్క సుశాంత్ మృతి కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న తరుణంలో అందాల నటి శ్రీదేవి మృతి వార్త మళ్లీ తెరపైకి వచ్చింది. శ్రీదేవి మరణంపై సీబీఐ దర్యాప్తు జరపాలనే డిమాండ్ ఊపందుకుంది. శ్రీదేవి బోనీకపూర్ ను పెళ్లి చేసుకోవడం, ఇద్దరు పిల్లలకు తల్లికావడం, 2018 ఫిబ్రవరి 24న దుబాయ్ లో హోటల్ రూమ్ బాత్ టబ్ లో పడి చనిపోవడం వరకూ అందరికీ తెలిసిన విషయాలే. ఈ నెల 13వ తేదీ శ్రీదేవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఓ హ్యాష్ ట్యాగ్ వైరల్ అయింది. అదేంటంటే ‘సీబీఐ ఎంక్వయిరీ ఫర్ శ్రీదేవి’. ఇంతలా ఈ డిమాండు రావడానికి కారణం… ఇంకెవరూ సుశాంత్ సింగ్ మరణమే. సుశాంత్ కేసును సీబీఐ కి అప్పగించినపుడు దుబాయ్ లో మరణించిన శ్రీదేవి కేసును సీబీఐకి ఎందుకు అప్పగించరని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ ఉద్యమం ఊపందుకుంది. పెళ్లి కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అనుమానాస్పద స్థితిలో బాత్ టబ్ లో చనిపోయి కనిపించింది.
అనుమానాలు ఎన్నో
శ్రీదేవిపై ప్రముఖ రచయత సత్యర్ధి నాయక్ ఓ పుస్తకం రాశారు. అందులో ఆమె మరణంపై ఎన్నో అనుమానాలను ఆయన ప్రస్తావించారు.శ్రీదేవి మరణానికి గల కారణం ఏమై ఉంటుందో కూడా ఆయన వివరించాడు. ఆయన శ్రీదేవి కుటుంబ సభ్యులతో పాటు ఆమెకు సన్నిహితంగా ఉండే సినిమావాళ్లను ప్రశ్నించిగా వచ్చిన సమాచారంతో నో ఈ పుస్తకం రాశారు. శ్రీదేవికి మొదటినుంచి ‘లో బీపీ’ ఉండేదని.. అపుడపుడూ షూటింగ్ షూటింగుల్లో కళ్లు తిరిగి పడిన సందర్భాలున్నాయని వివరించారు. శ్రీదేవితో ‘చాల్‌బాజ్’ చిత్రాన్ని తెరకెక్కించిన పంకజ్ పరాశర్ తనతో ఈ విషయాన్ని చెప్పినట్లు ఆయన తన పుస్తకంలో ప్రస్తావించారు.