వివాదాలకు ఎక్కువ.. సినిమాలకు తక్కువ అని పేరుపడ్డ తమిళ యంగ్ హీరో శింబు. అతడి ఫ్యామిలీ తరచుగా తిరుమల శ్రీవారిని దర్శించుకొని వెళుతుంటారు. ఏడునెలలుగా లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఉండిపోయిన శింబు, తిరిగి తన సినిమాల షూటింగ్స్ కు వెళ్ళబోతున్నాడు. అందుకే శ్రీవారిని దర్శించుకోవాలని మనోడికి బుద్దిపుట్టినట్టుంది. ఈ రోజు తన సన్నిహితులతో కలిసి తిరుమలలో వాలిపోయాడు శింబు .
అయితే అక్కడ శింబు బిహేవియర్ ఆలయ సిబ్బందికి, ప్రెస్ వారికి అంతుబట్టలేదు. ఆలయంలో ఉన్నంత సేపు, బైటికి వచ్చినప్పుడూ తన ముఖాన్ని పట్టువస్త్రంతో కప్పుకొనే తిరిగాడు. అయితే శింబు తన కొత్త సినిమాలోని వెరైటీ లుక్ .. పబ్లిక్ కు కనిపించకుండా ఉండేందుకే అలా ముఖాన్ని కప్పుకొనే తిరిగాడని అంటున్నారు. ఏదేమైనా వచ్చింది శింబు అని తెలిసిపోయింది కాబట్టి.. ఆ ముసుగు కాస్తా తొలంగించేస్తే ఏ బాధ ఉండకపోయేదని చెన్నై జనం అనుకుంటున్నారు.











