‘వన్ నేషన్..వన్ హెల్త్ కార్డు’ పథకాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రకటించే అవకాశాలున్నాయి. 74వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోటలో జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ఆయన ఈ పధకాన్ని ప్రకటించనున్నారు. దేశంలోని ప్రతి ఒక్క పోరాడి ఆరోగ్య రికార్డులను డిజిటల్ ఫార్మెట్‌లో భద్రపరచాలానే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలా? వద్దా? అనే నిర్ణయం ప్రజలకు వదిలేయడం పలు సందేహాలకు తావిస్తోంది. ప్రజలు వన్ నేషన్ కార్డులో నమోదు చేసుకున్నా ప్రజలకు లాభం ఏముందని ప్రశ్నలు తలెత్తున్నాయి. ప్రజల వ్యక్తగత సమాచారంపై కూడా సందేహాలు తలెత్తుతున్నాయి. ఆధార్ కార్డు తరహాలోనే హెల్త్ కార్డ్ కూడా రూపొందించామని చెబుతున్న ప్రభుత్వం ఆధార్ కార్డు తరహాలోనే ఎందుకు ఖచ్చితంగా అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.
ఈ కార్డు కావాలనుకునే వారికి యునీక్ ఐడీ ఇవ్వనున్నారు. ఈ ఐడీ ద్వారా యూజర్ లాగిన్ అవ్వచ్చు. ఓ వ్యక్తి తన మెడికల్ హిస్టరీ రిపోర్టులను ఆ కార్డులో పొందపరచనున్నారు. ఈ కార్డు వివరాలు డిజిటల్ రూపంలో సెంట్రల్ సర్వర్ లో భద్రపరుస్తారు. హాస్పిటల్స్, క్లినిక్, డాక్టర్లను ఈ సర్వర్లకు కనెక్ట్ చేస్తారు. దీంతో హాస్పిటల్ కు వెళ్లిన పేషెంట్ మెడికల్ రిపోర్టులతో సంబందం లేకుండా ఈ కార్డును ఉపయోగించుకోవచ్చు. ఈ పథకాన్ని త్వరలో మెడికల్ షాపులు, ఇన్సూరెన్స్ కంపెనీలకు కూడా విస్తరించే ఆవకాశం ఉందని వార్తల నేపథ్యంలో ఖచ్చితం అనికాకుండా ఐచ్ఛికమని చెప్పడంలోనే పలు అనుమానాలు నెలకొన్నాయి.











