వ్యక్తిగత, చిన్న మధ్య తరహా రుణగ్రహీతలకు ఊరటనిచ్చే వార్త. వడ్డీలపై వడ్డీని మాఫీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఆర్థిక శాఖ సుప్రీం కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. రూ.2 కోట్ల వరకు వ్యక్తిగత, చిన్న మధ్య తరహా రుణాలకు ఈ వెసులుబాటు వర్తిస్తుంది.
మారటోరియం.. ప్రభావం..
కరోనా మహమ్మారి కారణంగా దేశ.. ఆ మాటకొస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఈ నేపథ్యంలో రుణాల చెల్లింపును సరళీకృతం చేస్తూ రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా మారటోరియం ప్రకటించింది. దాని ప్రకారం బ్యాంకుల నుంచి రుణాలు పొందిన వ్యక్తులు, సంస్థలు తమ ఈఎంఐలను కొంతకాలం చెల్లించకుండా వాయిదా వేసుకోవచ్చు. ఈ పద్ధతి పైకి సానుకూలంగా కనిపించినా.. లాంగ్ రన్ లో భారంగా పరిణమించి వడ్డీకి వడ్డీ పడుతుంది. దరిమిలా ఆరు నెలలు అధికంగా వాయిదాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఎవరెవరికి? ఏంటి ప్రయోజనం?
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిపుణులతో సంప్రదించి కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి ఆగస్టు మధ్య కాలంలో వసూలు కాని ఈఎంఐలపై విధించే వడ్డీలకు అదనపు వడ్డీని మాఫీ చేయాలని తీర్మానించింది. ఎంఎస్ఎంఈ, విద్య, హౌసింగ్, ఆటోమొబైల్స్, క్రెడిట్ కార్డు బకాయిలు, వ్యక్తిగత రుణాలకు ఈ వెసులుబాటు లభించనుంది. సక్రమంగా ఈఎంఐలు చెల్లించిన వారికి తగిన సౌలభ్యాలు ఉంటాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో బడుగు జీవులు ఊపిరి పీల్చుకోవచ్చు.
నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్ Vs బండ్ల గణేష్ కౌంటర్..!
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...











