గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ టీడీపీ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర(నాని)ను ఎంపిక చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి రవీంద్ర టీడీపీలో కొనసాగుతున్నారు. కష్టకాలంలోనూ ఆయన పార్టీ ఎన్నంటే ఉన్నారు. ప్రస్తుతం ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడినా టీడీపీ పట్ల ఆయన విధేయంగానే ఉన్నారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయానికి ఆయన విశేషంగా కృషి చేశారు. 2019లో పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలిచిన గిరిధర్ వైసీసీలో చేరడంతో రవీంద్రను చంద్రబాబు ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకునే ప్రస్తుత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రవీంద్రకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.
Must Read ;- విశాఖ మేయర్ బరి.. అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తులు











