ఏపీలో అక్రమ కేసులు.. దౌర్జన్యంతో కూడిన అరెస్ట్ ల నేపధ్యంలో జగన్ రెడ్డి చేస్తున్న చేష్టలు సర్వత్ర విమర్శలకు తావిస్తున్నాయి. ప్రతిపక్షాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసి..కక్ష సాధించడమే ప్రధాన లక్ష్యంగా సాగుతున్న ఆయన ధ్రోరణిపై దేశ వ్యాప్తంగా రాజకీయ ఖండనలు వినిపిస్తున్న వేళ..లోకేష్ అరెస్ట్ కు అక్రమ కేసుల రచన చేస్తున్నారు. రాజధాని అమరావతి లో ఇన్నరింగ్ రోడ్డు అలైన్మెంట్ లో పెద్ద స్కాం జరిగింది. అందులో కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిందని కల్పిత కథనాలను వండి.. సీఐడీకి కేసు నమోదు చేయమని పురికొల్పంది వైసీపీ. దీంతో పునకం వచ్చిన భూతంలో సీఐడీ నిబంధనలకు వ్యతిరేకంగా అడ్డగోలు సెక్షన్లు కింద కేసు నమోదు చేసి అక్రమంగా ఎఫ్ఐఆర్ లు నమోదు చేస్తున్నారు.
స్కిల్ కేసులో జుడిషీయల్ కస్టడీలో ఉన్న చంద్రబాబు మాదిరిగానే ఇన్నరింగ్ రోడ్డు కేసులో ఏ-14 గా చేర్చి.. ఎన్నికల సమీపిస్తున్న వేళ లోకేష్ ను కూడా అరెస్ట్ చేసేందుకు పధక రచన జరుగుతోంది. అయితే ఈ కేసుపై తెలుగుదేశం పార్టీ హైకోర్టు లో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా.. అరెస్ట్ చేసేందుకు కాదు.. 41 ఏ నోటీసులు ఇచ్చి.. ఫార్మాలిటీగా విచారించి పంపుతామని సీఐడీ తరుఫున హైకోర్టు ఏజీ చెప్పారు.
అయితే తొండితో జగన్ చేసే నీచ రాజకీయాలు గుర్తెరిగిన టీడీపీ శ్రేణులు ఏపీ సీఐడీ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో తరలివస్తున్న టీడీపీ నేతలను.., కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని.. అరెస్ట్ లు చేస్తున్నారు. చొక్కాపడ పట్టుకుని ఈడ్చుకెళ్లి వాహనాలల్లో పడేస్తున్నారు. దీంతో తాడేపల్లి సీఐడీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో అలజడి నెలకొంది. జగన్ ప్రభుత్వం ఆడే డ్రామాలో లోకేష్ ను అరెస్ట్ చేస్తే.. ఊరుకునే ప్రసక్తే లేదని కార్యకర్తలు తెగేసి చెప్పడంతో ఏపీ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణ పరిస్ధితులు నెలకొన్నాయి.











