ఏపీ మంత్రి ఆర్కే రోజా పై సొంత పార్టీ నేతలే కాదు కేడర్.., నియోజకవర్గ ప్రజలు కూడా రగిలిపోతున్నారు.ఇక చాలమ్మ నీ డ్రామాలంటూ ప్రజలు రోడ్డుపై కి వచ్చి దుమ్మెత్తిపోస్తున్నారు.అధికార వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు ఉన్న రోజా.. నియోజకవర్గంలో రోజురోజుకు తన చెరిష్మాను దిగజార్చుకుంటుంది. సొంత పార్టీలోని నేతలు.., కార్యకర్తలు ఆమె నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ.. ప్రజలు కూడా రోడ్డెక్కి రోజా చేస్తున్న నిర్లక్ష్యపు రాజకీయాలను ఎండగడుతున్నారు. నాలుగేళ్ళుగా నగరిలో నరకం చూస్తున్నామని.. మౌళిక వసతుల కల్పనలో ఎందుకంత నిర్లక్ష్యమని రోజాను తీరును ఎండగడుతున్నారు.మరోవైపు రోజా సోదరులు చేసే ఎర్రచందనం.., ఇసుక.., గంజాయి.., కబ్జాలు.., అక్రమాస్తులు కూడగట్టడం వంటి వాటిపై సొంతపార్టీలోని వారే కథలు కథలుగా చెప్తుకుంటున్నారు.
మంత్రి రోజా పార్టీలో నడుచుకుంటున్న తీరుపై కేడర్ ఆది నుంచి అసంతృప్తిగానే ఉన్నారు. నియోజకవర్గంలోని నిండ్రా మండలం మొత్తం రోజా నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకే గతంలో శ్రీశైలం బోర్డు మెంబర్ గా రెడ్డివారి చక్రపాణి రెడ్డిని నియమించిన సంగతి కూడా పార్టీ మంత్రి రోజాకు అప్డేట్ చేయలేదు. అంటే ఇక్కడే అర్థమవుతోంది.. కేడర్ తోపాటు సొంతపార్టీ నేతలు కూడా ఏ స్థాయిలో రోజా తీరును వ్యతిరేకిస్తున్నారు బోధపడుతోంది.
పార్టీ నేతలతో కలిసి పనిచేయడం ఇష్టంలేని రోజా.. నిత్యం నియోజకవర్గంలోని ప్లాన్ – బీ అమలు చేస్తూ ముందుకు పోతుంటారు. స్థానికంగా కుత్రిమ వర్గపోరును సృష్టించి.. సొంత పార్టీలో వ్యతిరేకంగా ఉన్న వారిపై ప్రయోగిస్తారు. ఆ రాజకీయాలతోనే వారిని తన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నాలు సాగిస్తుంటారన్నది ప్రధానంగా వినిపించే టాక్. అదే రోజాకు నగరిలో నేడు బెడిసికొడుతోందని సర్వేలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో విద్యాదీవెన కార్యక్రమం నిధుల విడుదలకు నగరి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఎదుటే వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సీఎం కాన్వాయి పోవుమార్గం పొడవున స్వాగతం పలుకుతూ భారీ కట్ అవుట్స్.. ఫ్లెక్సీలు వెలిశాయి. అందులో లోకల్ నేతల ఫోటోలు ఉన్నాయ్ కానీ.., మంత్రి రోజా ఫోటో ఎక్కడా కనిపించలేదు. అలానే సీఎం కార్యక్రమం అయిన తరువాత ఈడిగ కార్పోరేషన్ చైర్ పర్సన్ కేజే శాంతి.., మంత్రి రోజా మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేసినా.. వారు విముఖత చూపారు. అంటే సీఎం సమక్షంలో సొంత పార్టీ కేడర్ తోపాటు తన కెబినెట్ మంత్రి రోజా కూడా అలా ప్రవర్తించడంతో జగన్ అవాక్కైయ్యారు.
ఇలా మంత్రి ఆర్కే రోజాకు సొంత పార్టీ కేడరే కాదు.. ప్రజలు సైతం దూరమవుతున్నారు. ఈర్ష.., ద్వేషాలతో రాజకీయంగా ఒంటెద్దు పొకడలకు పోతే.. పొలిటికల్ కేరియర్ ఏ విధంగా నాశనం అవుతోందన్న నానుడికి ఉదాహరణ రోజా నే అని విశ్లేషణలు ఈనాటివి కావు.











