ముఖ్యమంత్రి జగన్‌కి వచ్చే ఎన్నికల్లో ఓటమి తథ్యం అనే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్ సీపీకి రాజకీయ వ్యూహకర్తగా పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ సంస్థ ఈ విషయాన్ని తేటతెల్లం చేసిందట. ఐ ప్యాక్ సంస్థ ఏపీలో వైఎస్ఆర్ సీపీకి ప్రస్తుతం ఉన్న ఆదరణపై వివిధ రూపాల్లో సర్వే నిర్వహించగా జగన్ కు షాక్ ఇచ్చే ఫలితం వచ్చిందని తెలుస్తోంది. వైఎస్ఆర్ సీపీకి రాజకీయ లబ్ధి కోసం వివిధ వ్యూహాలను ప్రతిపాదిస్తూ ఐ ప్యాక్ సంస్థ పని చేస్తుంటుంది. కానీ, ప్రభుత్వ విధానాలతో ప్రజల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయిందని, ఇక తాము ఏం చేసినా వైఎస్ఆర్ సీపీని గెలిపించడం కష్టం అని ఐ ప్యాక్ కూడా చేతులెత్తేసినట్లుగా టాక్.
నిజానికి ఐ ప్యాక్ సర్వే వరకూ వెళ్లకపోయినా వైఎస్ఆర్ సీపీపై జనాల అభిప్రాయం ఏంటో సొంత పార్టీలోనే ప్రతి ఒక్కరికి తెలుసు. పైకి జగన్ మెప్పు కోసం గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ నేతలకు లోలోన తమ భవిష్యత్తు ఏంటనేది స్పష్టంగా తెలుసు. కేవలం బటన్లు నొక్కడం తప్ప మరే విషయంపైనా ఫోకస్ చేయకుండా ఏపీ పాలన సాగుతుంది. అది కూడా అప్పులు చేసి మరీ సంక్షేమాన్ని కొనసాగిస్తున్నారు. ఒకవేళ ఆ బటన్లు నొక్కుతూ డబ్బులు విదల్చడం వల్లే తమకు ఓట్లు రాలతాయని ఇంకా ఎవరైనా భ్రమల్లో ఉంటే.. వారికి ఐ ప్యాక్ సర్వేనే కనువిప్పు కలిగిస్తోంది. ఈ భ్రమల్లో ఉన్నవారి జాబితాలో తొలి స్థానంలో ఉండే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయన తన మొండి పాలనా విధానాలతో ప్రజల్ని వేధించుకు తినడం సంగతి అటుంచితే.. తనను తాను మోసం చేసుకుంటూ, ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులకు కూడా అన్యాయం చేస్తున్నారు. తాజాగా ఇప్పడు, ఐ ప్యాక్ తాజా సర్వేతో వైఎస్ఆర్ సీపీ నాయకులకు దిమ్మతిరిగి బొమ్మ కనిపించినట్లుగా సమాచారం.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రశాంత్ కిషోర్ తాజా సర్వే ఇలా ఉంది. తెలుగు దేశం, జనసేన పోటీ చేస్తే ఆ కూటమికి 140 కి పైగా సీట్లు దక్కుతాయని అంచనా. జగన్ పార్టీకి మాత్రం 30 కి మించి స్థానాలు రావడం కష్టమని ఐ ప్యాక్ సర్వేనే చెబుతోంది. జగన్ రెడ్డి ఐదేళ్ల అరాచక పాలనలో రాష్ట్రంలో డెవలప్ మెంట్ గాడి తప్పి, ఆగాధంలోకి కూరుకుపోయిందని ప్రజలు అభిప్రాయపడుతున్నట్లుగా సర్వే ద్వారా స్పష్టం అయింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలు ఎక్కించాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయి తీరాలనే భావన ప్రజల్లో ఉందని తెలుస్తోంది. రాష్ట్రానికి ఉండాల్సిన రాజధాని విషయంలో జగన్ నాలుగేళ్లుగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోవడం అతి పెద్ద మైనస్ అని, అదే వైఎస్ఆర్ సీపీకి తీరని చేటు చేయబోతోందని సర్వే ద్వారా స్పష్టం అయింది.











