నాలుగో సీజన్ బిగ్ బాస్… ఇప్పుడు ఐదో వారంలోకి అడగుపెట్టింది. అయితే ఈ వారం ఎలాంటి నామినేషన్ లేకుండానే గంగవ్వ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవడం హౌస్ మెంబర్స్ ను బాధించింది. అనారోగ్యకారణాలతోనూ, హోమ్ సిక్ సమస్యలతోనూ ఎప్పటి నుంచో తనను పంపించేయమన్న గంగవ్వకు ఆ మధ్య బిగ్ బాస్ నిర్వాహకులు హౌస్ లోనే ట్రీట్ మెంట్ ఇప్పించారు. దాన్నుంచి రికవర్ అయిన గంగవ్వ అప్పుడు బిగ్ బాస్ నుంచి వెళ్ళనని చెప్పింది.
అయితే ఈ వారం మరోసారి గంగవ్వకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో .. నాగార్జున బిగ్ బాస్ ను పర్మిషన్ అడిగి ఆమెకు హౌస్ నుంచి సాదరంగా వీడ్కోలు పలికారు. ఆ సందర్భంగా హౌస్ మేట్స్ తో తనకున్న అనుబంధాన్ని, నాగార్జున పట్ల ఆమెకున్న గౌరవాన్ని గంగవ్వ ప్రేక్షకుల సమక్షంలో తెలియజేసి .. హౌస్ నుంచి నిష్క్రమించారు. అయితే ఆమె ఏ కోరికతో హౌస్ లోకి అడుగుపెట్టిందో ఆ కోరికను నాగార్జున నిజం చేస్తానని ఆమెకు చెప్పడం ఆకట్టుకుంది. బిగ్ బాస్ సైతం మీరు అద్భుతంగా ఆడారని మిమ్మల్ని బిగ్ బాస్ ఎప్పటికీ మరిచిపోదు అని గంగవ్వతో చెప్పడం ఇక్కడ కొసమెరుపు.











