అక్కినేని నాగేశ్వరరావు మనవళ్ళలో అందరికన్నా సీనియర్ హీరో సుమంత్. ఆయన కెరీర్ లో కొన్ని మంచి హిట్స్ ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం పరాజయాలే ఉన్నాయి. అయినప్పటికీ ఎప్పటికప్పుడు తన సినిమాల్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు. గోదావరి, మధుమాసం, గోల్కొండ హైస్కూల్, సత్యం, గౌరీ, మళ్ళీ రావా లాంటి చిత్రాలే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఈ నేపథ్యంలో సుమంత్ ఇప్పుడో డిఫరెంట్ కేరక్టర్ తో ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతున్నాడు. సినిమా పేరు ‘అనగనగా ఒక రౌడీ’. ఇందులో సుమంత్ గెటప్ డిఫరెంట్ గా ఉండబోతోంది.
రీసెంట్ గా సుమంత్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఒక ఫోటో పోస్ట్ చేశాడు. కోరమీసాలు, పల్చటి గుండు హెయిర్ స్టైల్ లో ఉన్న ఒక రగ్డ్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా టైటిల్ ను బట్టి.. సుమంత్ ఇందులో రౌడీగా నటిస్తున్నాడని అర్ధమవుతోంది. నిర్మాత ఎవరు, దర్శకుడెవరు అనే విషయాలు ఇంకా రివీల్ అవలేదు. ప్రస్తుతం ‘కపటధారి’ అనే థ్రిల్లర్ లో నటిస్తోన్న సుమంత్ .. ఇకపై వెరైటీ కాన్సెప్ట్స్ ఎంపికచేసుకొనే ప్రయత్నంలో ఉన్నాడు. అందులో భాగంగానే అనగనగా ఒక రౌడీ మూవీ చేస్తున్నట్టు తెలుస్తోంది. బహుశా త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన రావచ్చు.
Anaganagaa… oka Rowdy pic.twitter.com/xbEvWlSPRk
— Sumanth (@iSumanth) October 31, 2020











