ప్రస్తుతం టాలీవుడ్ నవయువ దర్శకులు సరికొత్త కాన్సెప్ట్స్ తో ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా సినిమాలు తెరకెక్కిస్తూ.. టాలీవుడ్ లో తమ టాలెంట్ ప్రూవ్ చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త హీరో లక్ష్ .. ఇప్పుడు ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ అనే డిఫరెంట్ టైటిల్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. మొన్నీ మధ్య ‘వలయం’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న హీరో లక్ష్ .. ఈ సినిమాతో గ్యాంగ్ స్టర్ అవతారమెత్తుతున్నాడు.
ఈ రోజు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. క్యాచీ టైటిల్ తో అట్రాక్టివ్ గా డిజైన్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరా ఫిల్మ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ నిర్మిస్తోన్న ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ చిత్రానికి ఇషాన్ సూర్య దర్శకుడు. న్యూ డైమన్షన్ కేరక్టర్ తో ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతోన్న హీరో లక్ష్ .. ఈ సినిమాతో డిఫరెంట్ గా ఎలివేట్ కానున్నాడు. సాయి కార్తిక్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతోంది.











