హీరో సత్య దేవ్, డైరెక్టర్ గోపి గణేష్ పట్టాభి కాంబినేషన్ లో వచ్చిన ‘బ్లఫ్ మాస్టర్’ సినిమా 2018 డిసెంబర్ లో విడుదల అయింది. అభిషేక్ పిక్చర్స్ పతాకం ఫై రమేష్ పిళ్ళై , శివలెంక కృష్ణ ప్రసాద్ కలిసి, ‘బ్లఫ్ మాస్టర్’ సినిమా నిర్మించారు. సత్యదేవ్ నటనకి, సంభాషణలకు మంచి పేరు వచ్చినా, ఆర్ధికం గా విజయం సాధించలేదు . యూట్యూబ్ లో తెలుగు వెర్షన్ కోటి పైన వ్యూస్ సాధించింది. హిందీ డబ్బింగ్ వెర్షన్ కి రెండు కోట్ల పైన వ్యూస్ వచ్చాయి .
ప్రస్తుతం సత్యదేవ్ హీరోగా చాలా బిజీ అయ్యారు. నిత్యా మీనన్ తో ” స్కై ల్యాబ్”, తమన్నాతో ” గుర్తుందా శీతాకాలం”, ప్రియాంక జువాల్కర్ తో ” తిమ్మరుసు” సినిమాలు హీరోగా నటిస్తున్నారు సత్యదేవ్. ఇప్పుడు ” బ్లఫ్ మాస్టర్ డైరెక్టర్ గోపి గణేష్ తో మరో సినిమా చేయడానికి హీరో సత్యదేవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . ఒక అగ్ర నిర్మాత వీరి కాంబినేషన్ లో సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. 2021 ఆరంభంలోనే ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.











