కంప్లీట్ లవ్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందుతోన్న ప్రేమకథా చిత్రం ‘ప్రేమసాగరం 1995’. సాయీశ్వర్, ప్రియాంకా రేవరి జంటగా సాయి వైష్ణవి పిక్చర్స్ పతాకంపై వి,యస్.ఫణీంద్ర దర్శకత్వంలో గోపాల్ నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుమన్, రాజా రవీంద్ర, రమ్య ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్ ఈ నెల్లోనే ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమా టైటిల్ , మోషన్ పోస్టర్ ను హీరో సాయీశ్వర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.

నిర్మాత గోపాల్ నాయుడు మాట్లాడుతూ.. ఫణీంద్ర చెప్పినకథకు ఎంతో ఇన్స్పైర్ అయి ఈ సినిమాను నిర్మిస్తున్నానని, నేచురల్ లవ్, యూత్ ను ఆకట్టుకొనే ఎన్నో అంశాలతో ఈ సినిమా తెరకెక్కించామని ఆయన అన్నారు. అలాగే.. మా ‘ప్రేమసాగరం’ సినిమా ఎన్నో సినిమాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. అలాగే ఎంతగానో సోపోర్ట్ గా నిలుస్తూ సాయపడుతోన్న రాజ్ కందుకూరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు ఫణీంద్ర మాట్లాడుతూ.. రాజ్ కందుకూరికి థాంక్సని, ప్రేమ సాగరం సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైనరని, ప్రతీ ఒక్కరికీ బాగా నచ్చుతుందని చెప్పారు.











