నటసింహ నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మాస్ యాక్షన్ మూవీకి హీరోయిన్స్ ఎంపిక సమస్యగా మారింది. ప్రయాగ మార్టిన్, ప్రగ్యా జైస్వల్ ఇలా పలువురు హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. కానీ అందులో ఎవరినీ ఎంపికచేయలేదు. అయితే ఇప్పుడు ‘అవును’ ఫేమ్ పూర్ణ ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా ఫిక్స్ అయిందనే వార్తలొస్తున్నాయి. అలాగే సెకండ్ హీరోయిన్ గా అఖిల్ బ్యూటీ సాయేషా సైగల్ ఎంపికయిందని సమాచారం.
‘అఖిల్’ మూవీ తర్వాత శివాయ్, చినబాబు, బందిపోటు, గజినీ కాంత్’ సినిమాల్లో నటించిన ఆయేషా .. తమిళ నటుడు ఆర్యని పెళ్ళి చేసుకుంది. పెళ్ళి తర్వాత కూడా కథానాయికగా నటిస్తోన్న సాయేషా.. ప్రస్తుతం కన్నడలో పునీత్ రాజ్ కుమార్ సరసన ‘యువరత్న’లో నటిస్తోంది. అలాగే భర్త ఆర్యతో ‘టెడ్డీ’ అనే తమిళ మూవీలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో అమ్మడు బాలయ్య లాంటి అగ్రకథానాయకుడు సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. మరి ఈ సినిమాతో ఆయేషా సైగల్ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.











