బిగ్ బాస్ 4 విన్నర్, రన్నర్ ఎవరో క్లారిటీ వచ్చేసింది. అందరూ ఊహించినట్టు గానే బిగ్ బాస్ 4 విజేతగా అభిజిత్ నిలిచాడు. రన్నర్ విషయంలో కొంత అస్పష్టత నెలకొంది. రన్నర్ గా సోహెల్ నిలిచే అవకాశం ఉన్నా అతను కాలదన్నుకున్నాడు. హోస్ట్ అక్కినేని నాగార్జున ఓ ఆఫర్ ను ప్రకటించగానే దాన్ని ఆహ్వానించాడు సోహెల్. ఆ ఆఫర్ ఏమిటంటే అభిజిత్, సోహెల్, అఖిల్ లకు నాగార్జున ఎవరైనా బయటికి వెళ్లిపోతే రూ. 25 లక్షలు ఇస్తామని ఆఫర్ ప్రకటించారు. దానికి సోహెల్ వెంటనే స్పందించాడు. ఆ ప్రైజ్ మనీతో బయటికి వచ్చేశాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అభిజిత్ బిగ్ బాస్ ట్రోఫీని అందుకున్నాడు. దాంతో పాటు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ కూడా అభిజిత్ కు దక్కింంది.
ఆ డబ్బు తీసుకుని తను తప్పుకోడానికి అంగీకరించాడు. దాంతో విన్నర్ గా అభిజిత్ ను నాగార్జున ప్రకటించారు. చివరికి రన్నర్ గా అఖిల్ అనివార్యమైంది. అరియానా, హారిక ల విషయం నిన్ననే తేలిపోయింది. వారికి నాగార్జున రూ. 10 లక్షలు ఆఫర్ ఇచ్చినా వారు తిరస్కరించారు. దాంతో నాగార్జున ‘నీకు అంత ఓటింగ్ లేదు బయటికి రమ్మంటూ’ అరియానాని, ఆ తర్వాత హారికను బయటికి తెచ్చేశారు.
మిగిలిన ముగ్గురిలో విన్నర్, రన్నర్ లను ఈరోజు నిర్ణయించారు. ఫినాలే షూటింగ్ అన్నపూర్ణ ఏడెకరాలలో ఆదివారం మధ్యాహ్నం నుంచి జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభిజిత్ విజేతకు నువ్వేనంటూ నోయల్ ఉదయమే ట్వీట్ చేశాడు. తను తీసుకున్న రూ. 25 లక్షలలో 10 లక్షలను అనాథల కోసం వినియోగిస్తానని సోహెల్ ప్రామిస్ చేశాడు.
లీకు వీరులు ఎవరో?
బిగ్ బాస్ విజేతల విషయంలో సమాచారం ముందే లీకవుతున్నట్టుంది. ముఖ్యంగా హౌస్ మేట్స్ కు ముందే ఈ సమాచారం వచ్చేస్తోంది. నాగార్జున ఇచ్చిన ఆఫర్ కు సోహెల్ వెంటనే స్పదించడంలో ఉన్న ఆంతర్యం కూడా అదేనట. జాబితా సోహెల్ పేరు మూడో స్థానంలో ఉన్నట్లు లీకులు అందబట్టే ఆఫర్ వైపు సోహెల్ మొగ్గుచూపినట్టు తెలిసింది. ‘సోహెల్ నీ నంబర్ 3.. పాతిక లక్షలు తీసుకో’ అంటూ మహెబూబ్ నిన్ననే లీకు ఇచ్చాడు. ఈ కింది ట్విట్టర్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.
Mehaboob Leaked Sohel's Position Yesterday that he is not the Winner😂
So Today, Sohel preferred 25L instead of 2,3 places which he got from audience votes👍#BiggBossTelugu4#BBTeluguGrandFinale pic.twitter.com/m75BK8sCpx
— Praneeth 🚩 (@pranavpraneeth_) December 20, 2020
.@Abijeet Love ❤️ You⭐ See You With The Title💕 & Yes U Deserve More!!!!
I will cherish every minute spent with u…& Can't wait to hug you my friend!
Daaaaa party cheskundammmm!!!!https://t.co/YXkS4tR9fK— Noel (@mrnoelsean) December 20, 2020