బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపు ఖాయమైందని అంతా అనుకున్న తరుణంలో ఎన్నికల సంఘం ఒక్కసారిగా ట్విస్ట్ ఇచ్చింది. ఇంకా లెక్కపెట్టని నాలుగు ఈవీఎంలలో 1669 ఓట్లు ఉన్నాయని సీఈఓ ఝలక్ ఇచ్చింది. ఇంకా ఓటింగ్ పూర్తి కాలేదని ఎన్నికల సంఘం కమిషనర్ శశాంక్ గోయల్ ప్రకటించారు. అంతేకాకుండా నాలుగు ఈవీఎంలు మొరాయించాయని తెలుపుతూ బీజేపీ గెలుపుపై నీళ్లు చల్లారు. దీంతో బీజేపీ శ్రేణులు ఆశ్చర్యానికి గురయ్యారు. బీజేపీ విజయం ఖాయమైపోయిందన్న తరువాత సీఈఓ చేసిన ప్రకటన బీజేపీ నేతల్లో కలవరపాటును గురిచేసింది. 21, 188 పోలింగ్ కేంద్రాల్లో ఇంకా ఫలితాలు రాలేదని సీఈఓ తెలిపారు. నాలుగు ఈవీఎంలో 1669 ఓట్లు ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తామని శశాంక్ గోయల్ తెలిపారు. నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు చేపడతామని ఆయన చెప్పారు.
1470 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందారని మొదట డిక్లేర్ చేయడంతో బీజేపీ నేతలు, శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. అలాగే బీజేపీ గెలుపును స్వాగతిస్తూ మంత్రి కేటీఆర్ కూడా మీడియా సమావేశంలో తమ పార్టీ ఓటమిని ఒప్పుకున్నారు. చివరకు ఎన్నికల సంఘం ఈ రకంగా ట్విస్ట్ ఇవ్వడంతో మళ్లీ ఉత్కంఠకు తెరలేపింది. అయితే 21 పోలింగ్ కేంద్రంలో బీజేపీకి 142, టీఆర్ఎస్‌కు 132, కాంగ్రెస్‌కు 69 ఓట్లు పోలైయ్యాయి. అలాగే 188 పోలింగ్ కేంద్రాల్లో వచ్చిన ఫలితాల్లో బీజేపీకి 79, టీఆర్ఎస్‌కు 109, కాంగ్రెస్‌కు 146 ఓట్లు పోలయ్యాయి. ఇంకా మిగతా నాలుగు ఈవీఎంలలోని ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.











