పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎన్నడూ లేని దూకుడు చూపిస్తున్నారు. ఏడాదికి ఒక సినిమా చేసే పవన్ అయిదారు ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టారు. హిందీ ‘ పింక్ ‘ రీమేక్ గా రూపొందుతున్న ‘ వకీల్ సాబ్ ‘ తాజా షెడ్యూల్ ఇటీవల మొదలయింది. సినిమా సంక్రాంతి కి విడుదల కావడం సాధ్యం కాకపోవచ్చని ఇండస్ట్రీ వర్గాల టాక్. క్రిష్ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది కానీ మొదలు కాకపోవచ్చు. కొత్తగా ” అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమా రీమేక్ ఒప్పుకున్నారు పవన్ కళ్యాణ్. సాగర్ చంద్ర డైరెక్ట్ చేసే ఈ సినిమా డిసెంబర్ నుంచి మొదలు అవుతుందని అంటున్నారు. మరో వైపు హరీష్ శంకర్ మైత్రి మూవీ మేకర్స్ సినిమా ఎప్పుడు మొదలు అవుతుందో తెలియని పరిస్థితి. ఈ మూడు సినిమాలు కాకుండా వరుసగా సినిమాలు ఓకే చేస్తూ, వెళ్తున్నారు .
తాళ్లూరి రామ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఒక సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే స్క్రిప్ట్ రెడీ కాలేదు. బండ్ల గణేష్ కి ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఆ సినిమాకి డైరెక్టర్ ని ఇంకా నిర్ణయించలేదు. మరో వైపు14 రీల్స్ బ్యానర్ లో కూడా ఒక సినిమా చేయడానికి, పవన్ కళ్యాణ్ సూత్రప్రాయంగా అంగీకరించారని వార్తలు వస్తున్నాయి. హరీష్ శంకర్ ద్వారా ఈ ప్రాజెక్ట్ సెట్ అయిందని అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్స్ కి దర్శకుడు ఇంకా కంఫర్మ్ కాలేదు. కథ, డైరెక్టర్ లేకుండానే ప్రాజెక్ట్స్ సైన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అడ్వాన్స్ లు తీసుకుంటున్నారు . పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేయడం అభిమానులకు సంతోషాన్ని ఇస్తుంటే, లైన్ లో ఉన్న దర్శక నిర్మాతలు మాత్రం తమ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు.